తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసియా గేమ్స్​లో క్రికెట్.. 11 ఏళ్ల తర్వాత..

Asian Games 2022: క్రికెట్ అభిమానులకు గుడ్​న్యూస్. భారతీయులు ఎంతగానో ప్రేమించే క్రికెట్.. ఈ ఏడాది ఆసియా గేమ్స్​లో భాగం కానుంది. దాదాపు 11 ఏళ్ల తర్వాత తిరిగి ఈ క్రీడను ఆసియా గేమ్స్​లో భాగంగా నిర్వహిస్తున్నారు.

cricket
క్రికెట్

By

Published : Jan 27, 2022, 5:33 PM IST

Asian Games 2022: ఈ ఏడాది జరగనున్న ఆసియా గేమ్స్​లో క్రికెట్​ కూడా భాగం కానుంది. టీ20 ఫార్మాట్​లో పోటీలు నిర్వహించనున్నట్లు ఆసియా గేమ్స్​ 2022 నిర్వాహకులు స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 25 వరకు హాంగ్​జౌ, జెజియాంగ్, జైనా, సహా మరో ఐదు సిటీల్లో ఈ ఆసియా గేమ్స్​ జరగనున్నాయి. మొత్తంగా 40 క్రీడలను 61 విభాగాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈత, ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, గుర్రపు స్వారీ, ఫెన్సింగ్, ఫుట్​బాల్, హాకీ, జూడో, కబడ్డీ మొదలైన క్రీడలు ఆసియా గేమ్స్​లో కీలకం కానున్నాయి.

ఆసియా ఒలింపిక్స్​ మండలి అనుమతి అనంతరం.. ఈ-స్పోర్ట్స్, బ్రేక్ డ్యాన్సింగ్​ను కూడా ఆసియా గేమ్స్​లో చేర్చారు. ఈ నేపథ్యంలో క్రికెట్​తో పాటు ఈ రెండు క్రీడలు కూడా తొలిసారిగా మెగా టోర్నీలో భాగం కానున్నాయి.

ఒలింపిక్​ కౌన్సిల్ ఆఫ్​ ఆసియాలో దక్షిణ ఆసియా జోన్​ సభ్య దేశంగా ఉన్న భారత్​.. ఇప్పటివరకు జరిగిన అన్ని ఆసియా గేమ్స్​లో పాల్గొంది. 1990 మినహా.. మిగతా అన్నిసార్లు అధిక పతకాలు సాధించిన జాబితాలో టాప్​ 10లో నిలిచింది. మొత్తంగా 139 స్వర్ణాలు, 178 రజతాలు, 299 కాంస్య పతకాలు సొంతం చేసుకుంది భారత్.

అయితే.. 2021- 23 ఆసియా గేమ్స్​ను భారత్​లో టెలికాస్ట్​ చేసే అవకాశాన్ని సోనీ పిక్చర్స్​ నెట్​వర్క్​ ఇండియా(ఎస్​పీఎన్) సొంతం చేసుకుంది. పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్​, అఫ్గానిస్థాన్, భూటాన్, మాల్దీవ్స్​లో కూడా ఎస్​పీఎస్​ టెలికాస్ట్​ చేయనుంది. సోనీ లైవ్​ ద్వారా ఓటీటీల్లోనూ ప్రసారం చేయనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

హాకీ లెజెండ్ చరణ్​జిత్ కన్నుమూత

BBL Playoff Match: ఆఖరి బంతికి ఇలా కూడా చేస్తారా?

ABOUT THE AUTHOR

...view details