Asian Championship Trophy Final Match : ఆసియా ఛాంపియన్స్‌షిప్ 2023 హాకీ విజేతగా ఇండియా అవతరించింది. శనివారం చెన్నై వేదికగా హోరాహోరీగా సాగిన ఫైనల్స్‌లో మలేసియాతో తలపడ్డ భారత్ 4-3 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి గెలిచింది. ఈ టైటిల్ గెలవడం ద్వారా భారత్ ఖాతాలో నాలుగో ఆసియా హాకీ టైటిల్ వచ్చి చేరింది. అంతకుముందు... సెమీల్లో జపాన్‌తో తలపడ్డ భారత్ 5 -0 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది.
Ind Vs Pak Hockey 2023 :ఈ మ్యాచ్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ టీమ్ మెరుగ్గానే ప్రారంభించింది. 9వ నిమిషంలో జుగ్‌రాజ్ పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకుని అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాడు. అయితే మలేసియా చూపించిన దూకుడు వల్ల స్టేడియం కాసేపు మూగబోయింది. చూస్తుండగానే ఆ జట్టు 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మొదట అబుకమల్ (14వ), రహీమ్ (18వ) స్వల్ప వ్యవధిలో బంతిని నెట్‌లోకి పంపగా.. ఆ తర్వాత అమీనుద్దీన్ (28వ) గోల్ చేసి మలేసియా జట్టును తిరుగులేని స్థితిలో నిలిపాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన భారత్.. తమకొచ్చిన అవకాశాలను వృథా చేసుకుంది.
Asian Championship Hockey Final :అయితే మూడో క్వార్టర్ ఆఖరికి వచ్చినప్పటికీ గోల్స్ పడకపోవడం వల్ల ఆతిథ్య జట్టుకు ఓటమి తప్పదేమో అనిపించింది. కానీ ఆ క్వార్టర్ చివరిలో అద్భుతమే జరిగింది. 45వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌ను హర్మన్‌ప్రీత్ గోల్ కొట్టి స్కోరు లోటును 2-3కు మార్చగా.. అదే నిమిషంలో గుర్జాంత్ ఓ మెరుపు గోల్ సాధించి 3-3తో స్కోరు సమం చేశాడు. ఈ క్రమంలో వరుసగా రెండు గోల్స్ సమర్పించుకుని డీలాపడిన మలేసియాను ముంచుతూ ఆకాశ్‌దీప్ (56వ) ఓ తెలివైన షాట్‌తో భారత్‌ను విజయపథంలోకి నడిపించాడు. ఆఖరిదాకా ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్ విజయాన్ని అందుకుంది. కాగా జట్టుకు ఇది నాలుగో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ.