Asian championship wrestling 2022: ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్స్ రజత పతక విజేత, భారత కుస్తీవీరుడు రవికుమార్ దహియా సత్తా చాటాడు. రెజ్లింగ్ 57 కిలోల పురుషుల ఫ్రీస్టైల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. దీంతో వరుసగా మూడోసారి గోల్డ్‌మెడల్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. శనివారం జరిగిన తుది పోరులో కజకిస్థాన్‌కు చెందిన కల్జాన్ రఖత్ను దహియా 12-2 తేడాతో మట్టికరిపించాడు.
ఈ సీజన్లో రవి దహియాకు ఇది రెండో ఫైనల్ మ్యాచ్. గత ఫిబ్రవరిలో జరిగిన డాన్కొలోవ్ పోటీల్లో రజతం సాధించాడు. సోనెపట్‌లోని నహ్రీ గ్రామానికి చెందిన రవి.. మరోమారు తన బలాన్ని, వ్యూహాత్మకతను ప్రదర్శించాడు. అంతకుముందు 2020లో దిల్లీ, 2021లో అల్మాటిలో జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో స్వర్ణం సాధించాడు.