తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆసియా ఛాంపియన్​ షిప్ కీలకం' - ఒలింపిక్స్ గురించి మేరీ కోమ్

కరోనా వల్ల తన ట్రెయినింగ్ షెడ్యూల్ దెబ్బతిందని తెలిపింది బాక్సర్ మేరీ కోమ్. త్వరలో జరగబోయే ప్రపంచ ఛాంపియన్ షిప్ తనకు చాలా కీలకమని వెల్లడించింది.

Mary Kom
మేరీ కోమ్

By

Published : May 20, 2021, 8:46 AM IST

ఒలింపిక్స్ సన్నాహాకానికి ఆసియా బాక్సింగ్ ఛాంపియన్​షిప్ కీలకమని స్టార్ బాక్సర్ మేరీ కోమ్ చెప్పింది. దుబాయ్​లో 24న ఆరంభమయ్యే టోర్నీలో తలపడాలని ఆమె ఆశిస్తోంది. ఈ టోర్నీ తనకు చాలా అవసరమని పేర్కొంది.

"రింగ్​లోకి దిగాలని తహతహలాడుతున్నా. మహమ్మారి కారణంగా ఇంతకాలం పెద్దగా ప్రాక్టీసే లేదు. ఒలింపిక్స్​కు ముందు నన్ను నేను అంచనా వేసుకోవడానికి ఆసియా చాంపియన్​షిప్ చాలా అవసరం" అని ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ (51 కేజీల విభాగం) వెల్లడించింది.

మేరీ కోమ్ ప్రస్తుతం పుణేలో ఉంది. కరోనా కారణంగా దిల్లీలో జాతీయ శిబిరాన్ని మూసివేయడం వల్ల ఇంకొందరు బాక్సర్లతో పాటు ఆమె పుణేకు మారింది. ఆర్మీ స్పోర్ట్స్ ఇన్​స్టిట్యూట్​లో సాధన చేసింది. "చాలా కారణాలతో నా ట్రెయినింగ్ షెడ్యూలు దెబ్బతింది. కాబట్టి ఆసియా చాంపియన్​షిప్ చాలా ముఖ్యమైంది. అక్కడ పోటీ పడే అవకాశం వస్తుంది. ఒలింపిక్ సన్నాహాలకు మంచి టోర్నీకి మించి ఉపయోగపడేదేముంటుంది" అని మేరీకోమ్ చెప్పింది.

ABOUT THE AUTHOR

...view details