తెలంగాణ

telangana

ETV Bharat / sports

డ్రాగా ముగిసిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ - భారత్ పాక్​ మ్యాచ్ డ్రా

Asia Cup Hockey: ఆసియా కప్​లో భాగంగా నేడు జరిగిన భారత్​-పాక్​ మ్యాచ్​ను డ్రాగా ముగించారు ఆటగాళ్లు. దాయాది దేశాల మద్య సాగిన ఈ పోరు 1-1 గోల్స్‌తో డ్రా అయ్యింది.

Asia cup Hockey 2022 IND VS PAK
డ్రాగా ముగిసిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌

By

Published : May 23, 2022, 7:54 PM IST

Asia Cup Hockey IND VS PAK: ఆసియా కప్​ పురుషుల హాకీ టోర్నమెంట్​లో భాగంగా నేడు(సోమవారం) జరిగిన తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. దాయాది దేశాల మద్య సాగిన ఈ పోరు 1-1 గోల్స్‌తో డ్రా అయ్యింది. మ్యాచ్‌ ఆసాంతం భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించగా.. చివర్లో పాక్‌ ఓ గోల్‌ చేసి ఓటమిని తప్పించుకుంది.

మ్యాచ్‌ ప్రారంభం అయిన మొదటి క్వార్టర్‌లోనే భారత ఆటగాడు కార్తీ సెల్వమ్‌ అద్భుత గోల్‌ చేశాడు. ఆ తర్వాత రెండు క్వార్టర్లలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడినప్పటికీ ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. చివరిదైన నాలుగో క్వార్టర్‌లో పాక్‌కు పెనాల్టీ కార్నర్‌ లభించగా దాన్ని అబ్దుల్‌ రాణా సద్వినియోగం చేసుకున్నాడు. దీంతో స్కోర్లు సమంగా నిలిచాయి. ఈ ఏడాది జరుగుతున్న సిరీస్‌లో ఇదే తొలి మ్యాచ్‌. ఈ రెండు జట్లూ ఆసియా కప్‌ను మూడేసి సార్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.

ఇదీ చూడండి: ఇది ఆరంభం మాత్రమే.. అదే నా అంతిమ లక్ష్యం: ​ నిఖత్​

ABOUT THE AUTHOR

...view details