పుణెలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో (డీఐఏటీ) పాటు ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ను (ఏఎస్ఐ) రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defense Minister Rajnath Singh) ఆగస్టు 23న సందర్శించనున్నారు. దీనికి గోల్డ్‌మెడలిస్ట్ నీరజ్ చోప్డా (Neeraj Chopra) పేరు పెట్టే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ను సందర్శించినప్పుడు స్టేడియంలోని క్యాంపస్ పేరును నీరజ్ చోప్డా ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్, పుణె కంటోన్మెంట్‌గా మార్చే అవకాశం ఉందని డిఫెన్స్ పీఆర్ఓ వెల్లడించారు. దీనితోపాటు 16 మంది ఒలింపిక్ క్రీడాకారులను మంత్రి సత్కరించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన భవనం ప్రారంభోత్సవంలోనూ రాజ్‌నాథ్ పాల్గొంటారు. ఎం.టెక్, పీహెచ్డీ విద్యార్థులతో కలిసి మాట్లాడుతారు.