అర్జున అవార్డు గ్రహీత, భారత టేబుల్ టెన్నిస్ మాజీ అటగాడు చంద్రశేఖర్ కరోనా కారణంగా మృతిచెందారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కొవిడ్‌తో అర్జున అవార్డు గ్రహీత చంద్రశేఖర్ మృతి - టేబుల్ టెన్నిస్ ఆటగాడు చంద్రశేఖర్
భారత టేబుల్ టెన్నిస్ మాజీ ఆటగాడు చంద్రశేఖర్ కొవిడ్‌తో మృతిచెందారు. టేబుల్ టెన్నిస్‌లో మూడు సార్లు నేషనల్ ఛాంపియన్‌గా నిలిచారు చంద్రశేఖర్.
![కొవిడ్‌తో అర్జున అవార్డు గ్రహీత చంద్రశేఖర్ మృతి TT Player](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11730072-527-11730072-1620802687485.jpg)
వీ చంద్రశేఖర్, టేబుల్ టెన్నిస్ ఛాంపియన్
చెన్నైలో జన్మించిన చంద్రశేఖర్.. మూడు సార్లు నేషనల్ ఛాంపియన్‌గా నిలిచారు. 1982 కామన్వెల్త్స్ క్రీడల్లో సెమీఫైనల్ వరకు చేరుకున్నారు. కోచ్‌గాను చంద్రశేఖర్ మంచి పేరు తెచ్చుకున్నారు.