తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆర్చరీ ప్రపంచకప్​లో భారత్​కు మరో స్వర్ణం - ఇండియా ఆర్చరీ వరల్డ్ కప్

Archery World Cup India: ఆర్చరీ ప్రపంచకప్​లో భారత్​ రెండో స్వర్ణం గెలుచుకుంది. ఆదివారం జరిగిన రికర్వ్ మిక్స్​డ్ జట్టు ఫైనల్​లో భారత్ గోల్డ్ సాధించింది.

Archery World Cup India
Archery World Cup India

By

Published : Apr 24, 2022, 9:41 PM IST

Archery World Cup India: ఆర్చరీ ప్రపంచ కప్ 2022లో భారత్‌ రెండో స్వర్ణ పతకం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో భారత రికర్వ్ మిక్స్‌డ్ జట్టు బ్రిటన్‌ను ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది. బ్రిటన్‌ ఆర్చర్లు బ్రయోనీ పిట్‌మాన్, అలెక్స్ వైజ్‌లను భారత ఆర్చర్లు తరుణ్‌దీప్ రాయ్, రిధి షూట్ ఆఫ్ ద్వారా ఓడించారు. తొలి సెట్‌ని 37-35తో బ్రిటన్‌ గెల్చుకోగా.. రెండో సెట్‌ని 36-33తో భారత్‌ దక్కించుకుంది. 39-40 తేడాతో బ్రిటన్‌ మూడో సెట్‌ని గెల్చుకోగా.. నాలుగో సెట్‌ని భారత్ 38-37తో వశం చేసుకుంది. చెరో రెండు సెట్లు గెలవడంతో ఫలితం కోసం షూట్‌ ఆఫ్‌కు వెళ్లారు. అందులో భారత్ 18-17తో విజయం సాధించి పసిడి పతకం చేజిక్కించుకుంది.

India Gold medals Archery 2022: అంతకుముందు, శనివారం జరిగిన ఫైనల్​లో భారత కాంపౌండ్ మెన్స్ టీమ్.. బంగారు పతకాన్ని దక్కించుకుంది. ఫ్రాన్స్​తో జరిగిన గేమ్​లో భారత ఆర్చర్లు అభిషేక్ వర్మస అమన్ సైనీ, రజత్ చౌహాన్​లు.. మెరుగ్గా పోరాడి భారత్​ను గెలిపించారు. కాగా, ఆదివారం భారత మిక్స్​డ్ కాంపౌండ్ టీమ్.. కాంస్యం కోసం జరిగిన పోరులో చతికిల పడింది. అభిషేక్ వర్మ, ముస్కాన్​ కిరార్​తో కూడిన జట్టు.. ఓటమి చవిచూసింది.

ABOUT THE AUTHOR

...view details