తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆర్చరీ ప్రపంచకప్: ఫైనల్లో భారత మహిళా బృందం - ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో మహిళా బృందం

ఆర్చరీ ప్రపంచకప్​లో భారత రికర్వ్ మహిళా జట్టు ఫైనల్​కు దూసుకెళ్లింది. స్పానిష్​ బృందాన్ని 6-0 తేడాతో ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది.

Deepika kumari
దీపికా కుమారి

By

Published : Apr 24, 2021, 10:53 AM IST

ఆర్చరీ ప్రపంచకప్​లో భారత మహిళా జట్టు జోరు కొనసాగుతోంది. దీపికా కుమారి, అంకితా భగత్, కోమలికా బరితో కూడిన రికర్వ్ బృందం స్పానిష్ జట్టును 6-0 తేడాతో ఓడించి ఫైనల్​కు దూసుకెళ్లింది. ఆదివారం మెక్సికోతో తుదిపోరులో వీరు తలపడనున్నారు.

అలాగే రికర్వ్‌ పురుషుల విభాగం, మహిళల వ్యక్తిగత విభాగాల్లో సెమీఫైనల్‌ చేరుకున్న దీపికా కుమారి, అతాను దాస్‌.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో జత కట్టి కాంస్య పతక పోరుకు అర్హత సాధించారు. పురుషుల క్వార్టర్స్‌లో అతాను దాస్‌ 6-4తో ఎరిక్‌ పీటర్స్‌ (కెనడా)ను ఓడించగా.. మహిళల క్వార్టర్స్‌లో దీపిక 6-0తో మిచెలీ క్రోపెన్‌ (జర్మనీ)ని చిత్తు చేసింది. మహిళల రికర్వ్‌ క్వార్టర్స్‌లో అంకిత భాకత్‌ 2-6తో వెలాన్సియా (ఇటలీ) చేతిలో ఓడింది.

ABOUT THE AUTHOR

...view details