భారత ప్రముఖ ఆర్చర్లు దీపికా కుమారి, అతాను దాస్ 'ప్రేమ బాణం' లక్ష్యాన్ని చేరుకుంది. మంగళవారం ఝార్ఖండ్ రాంచిలోని ఓ బ్యాంకెట్ హాలులో వీరి వివాహం ఘనంగా జరిగింది. మూడు ముళ్ల బంధంతో వీరిద్దరు ఒక్కట్యయ్యారు. కరోనా దృష్ట్యా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ వేడుకను నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ హాజరయ్యారు.
లక్ష్యాన్ని చేరిన భారత స్టార్ ఆర్చర్ల 'ప్రేమబాణం' - ఆర్చర్లు దీపికా కుమారి, అతాను దాస్‌ల పెళ్లి జరిగిపోయింది
భారత స్టార్ ఆర్చర్లు దీపికా కుమారి, అతాను దాస్‌ల వివాహం.. మంగళవారం ఝార్ఖండ్‌లోని రాంచిలో ఘనంగా జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
![లక్ష్యాన్ని చేరిన భారత స్టార్ ఆర్చర్ల 'ప్రేమబాణం' archers Deepika Kumari and Atanu Das tied the knot in Ranchi today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7838253-thumbnail-3x2-rk.jpg)
దీపికా కుమారి, అతాను దాస్
వీరిద్దరూ, ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ మిక్సడ్ ఆర్చరీ విభాగానికి అర్హత సాధించారు. టోర్నీ వచ్చే ఏడాదికి వాయిదా పడిన నేపథ్యంలో ప్రాక్టీసుపై మరింత దృష్టి పెడతామని ఇటీవలే వెల్లడించారు.
ఇది చూడండి : 2011 ప్రపంచకప్ ఫైనల్‌పై క్రిమినల్ దర్యాప్తు