భారత ప్రముఖ ఆర్చర్లు దీపికా కుమారి, అతాను దాస్ 'ప్రేమ బాణం' లక్ష్యాన్ని చేరనుంది. ఈ ఏడాది జూన్ 30న వీరిద్దరి పెళ్లి చేసుకోనున్నారు. ఝార్ఖండ్ రాంచీలోని దొరండా గ్రామంలో ఓ అతిథి గృహంలో వీరి వివాహం జరగనుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొద్దిమంది ఆత్మీయలు మాత్రమే ఈ వేడుకకు హాజరు కానున్నారు.
వీరిద్దరికి 2018 డిసెంబరులో నిశ్చితార్థం జరిగింది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులు చకచక జరిగిపోతున్నాయి. దీపిక తరఫున 50, అతాను దాస్ 10 మంది మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు సమాచారం.