జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. ఆదివారం మరో రెండు రజతాలు ఆ రాష్ట్రం ఖాతాలో చేరాయి. మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో పల్లవి, ట్రిపుల్ జంప్‌లో కార్తీక వెండి పతకాలు గెలుచుకున్నారు. 64 కేజీల విభాగంలో స్నాచ్‌లో 88, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కలిపి మొత్తం 199 కేజీల ప్రదర్శనతో పల్లవి రెండో స్థానంలో నిలిచింది. జస్విర్ కౌర్ (200 కేజీలు- పంజాబ్) స్వర్ణం, రోషిలత (197 కేజీలు- మణిపూర్) కాంస్యం గెలిచారు. ట్రిపుల్ జంప్‌లో 12.85 మీటర్ల దూరం దూకిన కార్తీక ద్వితీయ స్థానం దక్కించుకుంది. షీనా (13.37మీ- కేరళ), పూర్వ సావంత్ (12.76మీ- మహారాష్ట్ర) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు నెగ్గారు. మరో ఏపీ అథ్లెట్ అనూష (12.72మీ) నాలుగో స్థానంలో నిలిచింది.
National games: జాతీయ క్రీడల్లో రష్మీకి రజతం - జాతీయ క్రీడల్లో ఏపీ అథ్లెట్ల జోరు
జాతీయ క్రీడల్లో ఆంధ్ర అథ్లెట్లు అదరగొడుతున్నారు. తాజాగా మన ఖాతాలో రెండు రజతాలు వచ్చి చేరాయి.
రష్మీకి రజతం: మహిళల స్కీట్ విభాగంలో తెలంగాణ షూటర్ రష్మీ రాథోడ్ రజతం గెలిచింది. ఫైనల్లో ఆమె 25 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. గణేమత్ (28- పంజాబ్), శివాని (17- మధ్యప్రదేశ్) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు నెగ్గారు. మహిళల 3×3 బాస్కెట్‌బాల్‌లో తెలంగాణ ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్‌లో ఆ జట్టు 21-14తో మహారాష్ట్రపై గెలిచింది. సోమవారం తుదిపోరులో కేరళతో తెలంగాణ తలపడుతుంది. బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలోనూ తెలంగాణ టైటిల్ పోరుకు చేరింది. సెమీస్‌లో జట్టు 3-2తో మహారాష్ట్రపై నెగ్గింది. సాయి ప్రణీత్ 21-10, 21-14తో వరుణ్‌పై, సుమీత్- విష్ణువర్ధన్ 18-21, 21-19, 23-21తో విప్లవ్- చిరాగ్‌పై, సిక్కిరెడ్డి- గాయత్రి 21-9, 21-16తో సిమ్రాన్- రితికపై గెలిచి జట్టుకు విజయాన్ని అందించారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో విష్ణువర్ధన్- గాయత్రి, మహిళల సింగిల్స్‌లో ఫరూఖీ ఓడిపోయారు. ఈ క్రీడల్లో మహారాష్ట్ర అమ్మాయి యశ్వితో జతకట్టిన హైదరాబాద్ స్కేటర్ రాహుల్ అదే రాష్ట్రం తరపున పసిడి దక్కించుకున్నాడు. జోడీ నృత్య విభాగంలో ఈ జంట అగ్రస్థానంలో నిలిచింది.
ఇదీ చూడండి: స్టేడియంలో 'ఫ్యాన్స్ ఫైట్'.. ఇలాంటి విషాదాలు ఎన్నో.. వందలమంది దుర్మరణం