తెలంగాణ

telangana

ETV Bharat / sports

జూనియర్ షూటింగ్ ప్రపంచకప్​లో అనీష్​కు స్వర్ణం

జర్మనీలో జరుగుతున్న ఐఎస్ఐఎస్​ఎఫ్ జూనియర్ ప్రపంచకప్​లో భారత్​ సత్తాచాటుతోంది. 25 మీటర్ల ​ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పోటీలో అనీష్ పసిడి సాధించాడు. ఈ పతకంతో భారత్​ ఖాతాలో స్వర్ణాల సంఖ్య 8కి చేరింది.

ఐఎస్ఐఎస్​ఎఫ్

By

Published : Jul 18, 2019, 8:38 AM IST

జర్మనీలో జరగుతున్న అంతర్జాతీయా క్రీడా షూటింగ్ ఫెడరేషన్(ఐఎస్ఐఎస్​ఎఫ్) జూనియర్ ప్రపంచకప్​లో భారత వర్థమాన షూటర్ అనీష్ భన్వాలా సత్తాచాటాడు. 25 మీటర్లు ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం సొంతం చేసుకున్నాడు.

జూల్​లో జరుగుతున్న ప్రపంచకప్​ నాలుగోరోజు పోటీల్లో అనీష్ 29 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. ఫైనల్​కు అర్హత సాధించిన ఆరుగురులో ముగ్గురు భారతీయులు కావడం విశేషం. రష్యాకు చెందిన ఈగర్ ఇస్మాకోవ్ 23 పాయింట్లతో రజతాన్ని కైవసం చేసుకున్నాడు.

మరో భారత షూటర్ ఆదర్శ్​ సింగ్ 17 పాయింట్లు సాధించి కొద్దిలో కాంస్యాన్ని చేజార్చుకున్నాడు. జర్మనీకి చెందిన పీటర్ 19 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఇదే రోజు మరో రెండు పతకాలను సొంతం చేసుకుంది భారత్​.

10 మీటర్ల ఎయిర్ రైఫిల్​ విభాగంలో శ్రేయా - యాష్ వర్ధన్ జోడి రజతాన్ని గెలవగా.. మెహులీ ఘోష్ - హృదయ్ హజారికా ద్వయం కాంస్యం గెలిచింది. ప్రస్తుతం భారత్​ ఖాతాలో పతకాల సంఖ్య20కు చేరింది. ఇందులో 8 స్వర్ణాలు, 8 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి.

ఇది చదవండి: పాక్​ క్రికెట్​ చీఫ్​ సెలక్టర్​గా ఇంజమామ్​ గుడ్​బై

ABOUT THE AUTHOR

...view details