ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్‌లో తెలుగు గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ఇటీవల ప్రతిష్ఠాత్మక కెయిన్స్ కప్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన ఈ ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్.. ఆదివారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 2586 ఎలో రేటింగ్ పాయింట్లున్నాయి. అగ్రస్థానంలో యిఫాన్ (2658) ఉంది. మరో గ్రాండ్‌మాస్టర్ హారిక ద్రోణవల్లి తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఓపెన్ విభాగంలో విశ్వనాథన్ ఆనంద్ 16వ, విదిత్ గుజరాతి 22వ స్థానాల్లో ఉన్నారు. ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
అగ్రస్థానం దిశగా తెలుగు గ్రాండ్‌మాస్టర్ హంపి - కోనేరు హంపి, చెక్ గేమ్
పెళ్లయిన రెండేళ్ల తర్వాత పునరాగమనం చేసిన చదరంగ ధ్రువతార, తెలుగుమ్మాయి కోనేరు హంపి. రీఎంట్రీ ఇచ్చిన రెండు నెలల్లోనే రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. తాజాగా ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది హంపి.
స్థానం మార్చుకుంటూ అగ్రస్థానం దిశగా హంపీ