దుబాయ్ వేదికగా జరుగుతోన్న బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ పోటీల్లో భారత బాక్సర్లు సత్తా చాటారు. అమిత్ పంగాల్(52 కేజీ), శివ థాప(64 కేజీ).. ఫైనల్లోకి దూసుకెళ్లారు.
పంగాల్.. కజకిస్థాన్ బాక్సర్ సాకెన్ బిబోస్సినోవ్పై 5-0 తేడాతో విజయం సాధించాడు. వీరిద్దరూ గతంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తలపడగా.. పంగాల్నే విజయం వరించింది. వరుస పిడిగుద్దులతో ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వలేదు పంగాల్. ఈ పోటీల్లో వరుసగా ఐదో పతకాన్ని సాధించిన తొలి భారత బాక్సర్‌గా శివ థాప ఘనత వహించాడు. 2013లో స్వర్ణంతో మెరిసిన శివ, 2015, 2019లో కాంస్య పతకం గెలుపొందాడు. 2017లో సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు. తజకిస్థాన్‌కు చెందిన బాక్సర్ బఖోదుర్ ఉస్మోనోవ్పై 4-0తో గెలుపొందాడు.
జాతీయ ఛాంపియన్ వారిందర్ సింగ్(60 కేజీ).. సెమీస్‌లో ఓడిపోయాడు. ఇరాన్ బాక్సర్ దనియల్ షాబాక్ష్ 2-3తో వారిందర్పై విజయాన్ని నమోదు చేశాడు. దీంతో అతనికి కాంస్య పతకం లభించనుంది.