తెలంగాణ

telangana

ETV Bharat / sports

బాక్సింగ్​: పంఘాల్ పంచ్​కు పతకం పక్కా - amit panghal

రష్యా వేదికగా జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో భారత బాక్సర్ అమిత్ పంఘాల్ పతకం ఖరారు చేసుకున్నాడు. క్వార్టర్స్​లో కార్లో పాలమ్​పై(ఫిలిప్పీన్స్​) నెగ్గి సెమీస్ చేరాడు.

అమిత్ పంఘాల్

By

Published : Sep 18, 2019, 5:09 PM IST

Updated : Oct 1, 2019, 2:10 AM IST

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో ఆసియా గేమ్స్ స్వర్ణ పతక గ్రహీత అమిత్ పంఘాల్ సత్తాచాటాడు. ఈ టోర్నీలో పతకం ఖాయం చేసుకున్న ఐదో భారత బాక్సర్​గా ఘనత సాధించాడు. 52 కేజీల విభాగంలో ఫిలిప్పీన్స్​కు చెందిన కార్లో పాలమ్​పై విజయం సాధించి సెమీస్​కు చేరాడు.

క్వార్టర్స్​లో 4-1 తేడాతో గెలిచి కాంస్యాన్ని ఖరారు చేసుకున్నాడు అమిత్. గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లోనూ సెమీస్​లో కార్లోను ఓడించాడు.

సెమీస్​లో కజకిస్థాన్​కు చెందిన బిబోసినోవ్​తో తలపడనున్నాడు అమిత్ పంఘాల్.

మరో క్వార్టర్స్‌లో 63 కేజీల విభాగంలో మనీశ్‌ కౌశిక్‌ సెమీస్‌కు చేరుకున్నాడు. 5-0 తేడాతో బ్రెజిల్‌ బాక్సర్‌ను చిత్తుగా ఓడించాడు. దీంతో ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమని బాక్సింగ్‌ ఫెడరేషన్ ట్వీట్‌ చేసింది.

పంఘాల్ పంచ్​కు పతకం పక్కా

గత ఏడాది క్వార్టర్స్​లో నిష్క్రమించిన అమిత్ ఈ సీజన్​లో తనదైన రీతిలో రెచ్చిపోయి పతకం పక్కా చేసుకున్నాడు. ఆ టోర్నీలో 49 కేజీల విభాగంలో తలపడిన అమిత్ డిఫెండింగ్ ఛాంపియన్ దస్మతోవ్ చేతిలో పరాజయం చెందాడు.

పాక్​లో పర్యటించేందుకు లంక బోర్డు మొగ్గు!

Last Updated : Oct 1, 2019, 2:10 AM IST

ABOUT THE AUTHOR

...view details