ఫ్రాన్స్‌లోని నాంటెస్ వేదికగా జరుగుతున్న అలెక్సిస్ వాస్టిన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు సత్తాచాటారు. అమిత్ పంఘల్ (52 కిలోలు), సంజీత్ (91 కిలోలు) వేర్వేరు విభాగాల్లో బంగారు పతకాలను సాధించారు.
ఫ్రెంచ్ బాక్సింగ్ టోర్నీలో అమిత్, సంజీత్లకు స్వర్ణం - అమిత్ పంఘల్
అలెక్సిస్ వాస్టిన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్లు సత్తాచాటారు. అమిత్ పంఘల్, సంజీత్ వేర్వేరు విభాగాల్లో స్వర్ణ పతకాలను సాధించారు.
అమెరికన్ రెనే అబ్రహాంను 3-0 తేడాతో ఓడించి పతకం ఖాయం చేసుకున్నాడు అమిత్ పంఘల్. మరోవైపు ఫ్రెంచ్ ఆటగాడు సోహెబ్ బౌఫియాను సంజీత్ ఓడించాడు. 57 కిలోల విభాగంలో స్థానిక బాక్సర్ శామ్యూల్ కిస్టోహూర్రీతో పోటీకి దిగిన కవిందర్ సింగ్ బిష్ట్ రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. శివ థాపా (63 కిలోలు), సుమిత్ సంగ్వాన్ (81 కిలోలు), సతీశ్ కుమార్ (+91 కిలోలు) రూపంలో భారత్‌కు మూడు కాంస్య పతకాలు లభించాయి.
మార్చిలో జోర్డాన్ వేదికగా జరిగిన ఒలింపిక్ అర్హత పోటీ తర్వాత భారత బాక్సర్లు పాల్గొన్న మొదటి అంతర్జాతీయ టోర్నీ ఇదే. ఇందులో 9 మంది భారతీయులు (5 పురుషులు, 4 మహిళలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.