తెలంగాణ

telangana

By

Published : Sep 19, 2019, 5:52 PM IST

Updated : Oct 1, 2019, 5:43 AM IST

ETV Bharat / sports

బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో భారత బాక్సర్లు రికార్డు

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో సెమీస్​లో అడుగుపెట్టిన భారత బాక్సర్లు అమిత్ పంఘాల్, మనీశ్ కౌశిక్.. పతకాలు ఖరారు చేసుకున్నారు. వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ క్వాలిఫయర్స్​కు నేరుగా అర్హత సాధించారు.

అమిత్ పంగల్, మనీశ్ కౌశిక్

రష్యా వేదికగా జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో భారత బాక్సర్లు చరిత్ర సృష్టించారు. సెమీస్​కు చేరిన అమిత్ పంఘాల్(52 కేజీలు)​, మనీశ్ కౌశిక్(63 కేజీలు).. పతకాలు ఖరారు చేసుకున్నారు. ఈ టోర్నీలో భారత్​ తరఫున ఒకరు కంటే ఎక్కువ మంది బాక్సర్​లు సెమీస్​ చేరడం ఇదే తొలిసారి.

ఈ విషయంపై స్పందించిన బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ).. ఇందులో పతకాలు సాధించిన క్రీడాకారులు.. వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ క్వాలిఫయర్స్​కు నేరుగా అర్హత సాధిస్తారని వెల్లడించింది.

"అమిత్, మనీశ్.. క్వాలిఫయర్స్​కు అర్హత సాధిస్తారు. వారికి ఎటువంటి ట్రయల్స్​ నిర్వహించం".-శాంటియాగే నైవా, భారత బాక్సింగ్ హై కమీషనర్

మిగతా భారత బాక్సర్లు.. వ్యక్తిగత ప్రదర్శన, జాతీయ ఈవెంట్​ల్లో పాయింట్ల ఆధారంగా ఒలింపిక్స్ క్వాలిఫయర్స్​కు ఎంపిక అవుతారు.

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​ సెమీస్​లోకి అడుగుపెట్టిన అమిత్ పంఘాల్.. కజికిస్థాన్​కు చెందిన సాకెన్ బిబోసినోవ్​తో తలపడనున్నాడు. టాప్​ సీడ్​ ప్లేయర్​ ఆండీ గోమేజ్​తో తాడోపేడో తేల్చుకోనున్నాడు కౌశిక్. వీరిద్దరూ ఇందులో గెలిచి వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ బరిలో నిలవాలని చూస్తున్నారు.

2018 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన అమిత్, ఆసియా ఛాంపియన్​షిప్​లోనూ పతకం నెగ్గాడు. జాతీయ మాజీ ఛాంపియన్​ అయిన కౌశిక్.. 2018 కామన్వెల్త్ గేమ్సలో వెండి పతకం సొంతం చేసుకున్నాడు.

ఇది చదవండి: ముందు కోహ్లీ.. తర్వాత మిల్లర్.. వాట్ ఏ క్యాచ్​

Last Updated : Oct 1, 2019, 5:43 AM IST

ABOUT THE AUTHOR

...view details