రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ వేదికగా జరుగుతోన్న బాక్సింగ్ టోర్నీ 52 కిలోల విభాగంలో భారత బాక్సర్ అమిత్ పంగాల్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. స్థానిక బాక్సర్ తమీర్ గాలనోవ్పై 5-0 తేడాతో విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాడు.
ఇదే టోర్నీలో భారత్‌కు చెందిన బాక్సర్లు సుమిత్ సంగ్వాన్ (81 కిలోల విభాగం), మహ్మద్ హుస్సాముద్దీన్ (57 కిలోలు), నమన్ తన్వర్ (91 కిలోలు), ఆశిష్ కుమార్ (75 కిలోలు), వినోద్ తన్వర్ (49 కిలోలు) ఇప్పటికే నిష్క్రమించారు.
రష్యాకు చెందిన ఇగోర్ త్సారెగోరోడ్ట్సేవ్తో 49 కిలోల విభాగంలో వినోద్ తవ్వర్ ఓడిపోయాడు. ఉజ్బెకిస్థాన్ బాక్సర్ డిషోడ్ రుజ్మెటోవ్(81 కేజీలు)పై సుమిత్ సంగ్వాన్ పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. 91 కేజీల విభాగంలో కజకిస్థాన్‌కు చెందిన ఐబక్ ఓరల్బేపై 0-5 తేడాతో నమన్ తన్వర్ ఓడిపోయాడు.
మరోవైపు రష్యాకు చెందిన నికితా కుజ్మిన్తో 75 కేజీల విభాగంలో ఆశిష్ కుమార్.. ఉజ్బెకిస్థాన్ మిరాజిజ్ మురాఖాలిలోవ్తో 57 కిలోల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ హుస్సాముద్దీన్ పరాజయాన్ని చవిచూశారు.
ఇదీ చూడండి..'టీమ్ఇండియాకు అతడు భవిష్యత్ ఆల్‌రౌండర్'