తెలంగాణ

telangana

ETV Bharat / sports

బాక్సింగ్​ ప్రపంచకప్​ ఫైనల్లో అమిత్ పంగల్ - బాక్సింగ్​ ప్రపంచకప్​ వార్తలు

జర్మనీ వేదికగా జరుగుతున్న బాక్సింగ్​ ప్రపంచకప్​ టోర్నీలో భారత బాక్సర్​ అమిత్​ పంగల్​ ఫైనల్​కు దూసుకెళ్లాడు. గురువారం 52 కేజీల విభాగం సెమీఫైనల్లో ఫ్రాన్స్​ బాక్సర్​ బిలాల్​ను చిత్తు చేశాడు. మరోవైపు అమిత్​తో పాటు పాజా రాణి, మనీషా, సిమ్రన్​జీత్​ కౌర్​లు నేరుగా సెమీస్​కు చేరుకున్నారు.

Amit Panghal in final, 4 medals assured for India at boxing WC
బాక్సింగ్​ ప్రపంచకప్​ ఫైనల్​లో అమిత్​ ఫంగాల్​

By

Published : Dec 18, 2020, 9:26 AM IST

Updated : Dec 18, 2020, 9:40 AM IST

ప్రపంచకప్‌ బాక్సింగ్‌ టోర్నీలో భారత స్టార్‌ బాక్సర్‌ అమిత్‌ పంగల్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. జర్మనీలో జరుగుతున్న టోర్నీలో గురువారం 52 కేజీల విభాగం సెమీఫైనల్లో పంగల్‌ 5-0తో బిలాల్‌ (ఫ్రాన్స్‌)ను చిత్తు చేశాడు. అమిత్​తో పాటు పూజా రాణి (75 కేజీలు), మనీషా (57 కేజీలు), సిమ్రన్‌జీత్‌ కౌర్‌ (60 కేజీలు)లకు నేరుగా సెమీఫైనల్‌ ఆడే అవకాశం వచ్చింది. కొవిడ్‌ కారణంగా డ్రాల పరిమాణం తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. దీంతో భారత్‌కు ముందే నాలుగు పతకాలు ఖాయమయ్యాయి.

కాగా, భారత జట్టులో ఒక సహాయక సభ్యుడికి కరోనా రావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే అతనితో కలిసి ప్రయాణించిన బాక్సర్లెవరికీ పాజిటివ్‌ రాకపోవడం ఊరటనిచ్చే విషయం. ఈ టోర్నీలో ఆడాల్సిన శివ థాపా (63 కేజీలు, సంజీత్‌ (91 కేజీలు) ఇప్పటికే గాయాలతో తప్పుకున్నారు. భారత్‌తో పాటు, బెల్జియం, క్రొయేషియా, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, మాల్దోవా, నెదర్లాండ్స్‌, పోలెండ్‌, ఉక్రెయిన్‌ దేశాల బాక్సర్లు బరిలో ఉన్నారు.

Last Updated : Dec 18, 2020, 9:40 AM IST

ABOUT THE AUTHOR

...view details