తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత బాక్సర్ల సత్తా.. సెమీస్​లోకి పంగాల్, వారిందర్ - varinder singh

దుబాయ్ వేదికగా జరుగుతోన్న బాక్సింగ్ పోటీల్లో భారత బాక్సర్లు రాణించారు. పురుషుల 52 కేజీల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ అమిత్ పంగాల్, 60కేజీల విభాగంలో వారిందర్ సింగ్ సెమీస్​ చేరుకున్నారు.

Amit Panghal, Asian Boxing Championships
అమిత్ పంగాల్, భారత బాక్సర్​

By

Published : May 26, 2021, 10:46 PM IST

దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్​షిప్స్​లో భారత బాక్సర్లు సత్తా చాటారు. 52 కేజీల పురుషుల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్​ అమిత్ పంగాల్​ సెమీస్​లోకి దూసుకెళ్లాడు. మంగోలియా బాక్సర్​ ఖార్ఖు ఎన్ఖ్మండఖ్​పై విజయం సాధించి.. ఈ పోటీల్లో పతకాన్ని ఖాయం చేసుకున్నాడు పంగాల్. ఇక మరో బాక్సర్​ వారిందర్ సింగ్ 60 కేజీల విభాగంలో ఫిలిప్పీన్స్​ బాక్సర్​ జెరె సాముల్పై​ 5-0తో గెలుపొంది సెమీస్​కు అర్హత సాధించాడు.

మరో పోటీలో భారత బాక్సర్ సంజీత్​.. తజకిస్థాన్​కు చెందిన జసుర్​ ఖుర్బనోవ్​పై విజయం సాధించాడు. 5-0తో విజయం సాధించిన భారత బాక్సర్​ సెమీస్​కి అర్హత పొందాడు. తన తర్వాత పోటీలో ఉజ్బెకిస్థాన్​కు చెందిన సంజర్​ తుర్సునోవ్​తో తలపడనున్నాడు.

ఇప్పటికే సాక్షి, సంజీత్, జాస్మిన్, సిమ్రాన్​జీత్ కౌర్, మేరీ కోమ్, శివ థాప.. క్వార్టర్స్​లో విజయాలు సాధించి భారత్​కు ఏదో ఒక పతకాన్ని ఖాయం చేసుకున్నారు. తాజాగా పంగాల్ కూడా వీరితో పాటు చేరాడు. దీంతో ఈ సీజన్​లో భారత్​ మొత్తం 14 పతకాలను ఖాయం చేసుకుంది. 2019లో ఆసియన్​ ఛాంపియన్​షిప్స్​లో 13 పతకాలు సాధించింది ఇండియా. ఈసారి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇక మహిళల పోటీల్లో సాక్షి(54 కేజీ).. తజకిస్థాన్​కు చెందిన రుహాఫ్జో హఖజరోవాపై 5-0తో గెలుపొందింది. తన తదుపరి పోటీలో టాప్​ సీడ్, కజకిస్థాన్​ బాక్సర్​ దినా జోలమన్​తో తలపడనుంది. మరో భారత బాక్సర్ జాస్మిన్.. మంగోలియా బాక్సర్​ ఒయున్త్సెగ్​ యెసుగెన్​పై 4-1తో విజయం సాధించింది. తన తర్వాతి రౌండ్​లో కజకిస్థాన్​ ప్లేయర్​ వ్లాదిస్లావ కుఖ్తాతో పోటీకి దిగనుంది. ఇటీవలే కొవిడ్ నుంచి కోలుకున్న సిమ్రాన్​జీత్​ కౌర్​.. ఉజ్బెకిస్థాన్​ బాక్సర్​ రైఖోనా కొడిరోవాపై 4-1తో గెలుపొందింది. తన తర్వాతి మ్యాచ్​లో కజకిస్థాన్​ బాక్సర్​తో తలపడనుంది.

ఇదీ చదవండి:టెస్టుల్లో ఆ సిక్స్​.. క్రిస్ గేల్​, పంత్​కే సాధ్యం!

ABOUT THE AUTHOR

...view details