ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది. 52 కేజీల విభాగంలో అమిత్ పంఘల్ పసిడిని సాధించాడు. సెమీఫైనల్లో కొరియా బాక్సర్ కిమ్ ఇంక్యూపై విజయదుందుబి మోగించాడు. 2018 ఆసియన్ గేమ్స్‌లోనూ గోల్డ్ మెడల్ సాధించాడీ బాక్సర్.
'ఆసియన్ బాక్సింగ్ ఛాంప్'లో భారత్‌కు పసిడి - amit panghal
ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ పసిడి బోణీ కొట్టింది. అమిత్ పంఘల్ ఫైనల్లో కొరియా ఆటగాడిపై గెలిచి, స్వర్ణం సాధించాడు.

అమిత్ పంఘల్
దీపక్ సింగ్ (49కేజీ), కవీందర్ సింగ్ బిష్త్ (56కేజీ) రజతాలతో సరిపెట్టుకున్నారు. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన నోడిర్జిన్ చేతిలో దీపక్ ఓటమి చెందగా, ఉజ్బెకిస్థాన్కే చెందిన మిరజిజ్బెక్ చేతిలో బిష్త్ పరాజయం పాలయ్యాడు.
Last Updated : Apr 26, 2019, 1:34 PM IST