ప్రపంచకప్ బాక్సింగ్‌లో అమిత్ పంగల్ స్వర్ణం గెలిచాడు. జర్మనీలో జరుగుతున్న టోర్నీలో 52 కేజీల ఫైనల్లో టెర్టెర్‌యాన్ (జర్మనీ) వాకోవర్ ఇవ్వడం వల్ల పసిడి పంగల్ సొంతమైంది. మరోవైపు 57 కేజీల సెమీస్‌లో హైదరాబాదీ హుసాముద్దీన్ జోరుకు బ్రేక్ పడింది. అతను స్థానిక ఆటగాడు హస్మత్ షాద్లోవ్ చేతిలో పరాజయం చవిచూసి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఇదే కేటగిరి సెమీస్‌లో గౌరవ్ సోలంకీ.. శామ్యూల్ (ఫ్రాన్స్) చేతిలో ఓటమి పాలయ్యాడు.
ప్రపంచకప్ బాక్సింగ్‌లో అమిత్ పంగల్‌కు స్వర్ణం - బాక్సింగ్ ప్రపంచకప్ వార్తలు
బాక్సింగ్ ప్రపంచకప్‌లో భారత బాక్సర్ అమిత్ పంగల్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 52 కేజీల ఫైనల్లో జర్మనీకి చెందిన టెర్టెర్యాన్పై విజయం సాధించాడు. మరోవైపు 57 కేజీల సెమీస్‌లో హైదరాబాదీ హుసాముద్దీన్ కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు.
91+ కేజీల సెమీస్‌లో 4-1తో మొయింజె (ఫ్రాన్స్)ను ఓడించి ఫైనల్ చేరిన సతీశ్ కుమార్.. గాయం కారణంగా బౌట్ నుంచి తప్పుకుని రజతంతో సంతృప్తి పడ్డాడు. 57 కేజీల విభాగంలో సాక్షి, మనీషా కూడా తుది సమరానికి అర్హత సాధించారు. సెమీస్‌లో మనీషా 5-0తో భారత్‌కే చెందిన సోనియాపై, సాక్షి 4-1తో రమోనా (జర్మనీ)పై గెలిచారు. ఫైనల్లో స్వర్ణం కోసం మనీషాతో సాక్షి తలపడనుంది. ఆసియా క్రీడల కాంస్య పతక విజేత పూజా రాయ్ కూడా కంచుకే పరిమితమైంది.
ఇదీ చూడండి:టోక్యో ఒలింపిక్స్ వ్యయం భారీగా పెరగనుందా?