బాక్సర్ అమిత్ పంఘాల్ పేరును రెండోసారి అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది భారత బాక్సింగ్ ఫెడరేషన్. గతేడాది కూడా అమిత్ పేరును సూచించగా.. అవార్డు దక్కలేదు.
బాక్సర్ అమిత్ పంఘాల్ పేరు అర్జునకు సిఫార్సు - boxing
ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన బాక్సర్ అమిత్ పంఘాల్ పేరును అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది భారత బాక్సింగ్ ఫెడరేషన్. ఇంతకుముందు 49 కేజీల విభాగంలో పోటీపడిన అమిత్.. ఈ ఏడాది నుంచి 52 కేజీల విభాగంలో సత్తాచాటుతున్నాడు.
2018లో ఆసియా క్రీడల్లో బంగారు పతకాన్ని చేజిక్కుంచుకున్నాడు అమిత్. ఇండోనేషియా జకర్తాలో జరిగిన ఫైనల్లో ఒలింపిక్ ఛాంపియన్ దస్మాతోవ్(ఉజ్బెకిస్థాన్)ను ఓడించి పసిడి కైవసం చేసుకున్నాడు. 49 కేజీల విభాగంలో ఈ ఘనత సాధించాడు. ఈ విజయం తర్వాత గతేడాది అర్జునకు నామినేటైనా.. పురస్కారం దక్కలేదు.
2012లో డోప్ టెస్టులో విఫలమైన అమిత్.. ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు. అనంతరం చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. ఈ సంవత్సరం 52 కేజీల విభాగానికి మారి విజయాలు సొంతం చేసుకుంటున్నాడు. ఆసియా ఛాంపియన్షిప్లో దస్మతోవ్ను మళ్లీ ఓడించి స్వర్ణం నెగ్గగా... బల్గేరియా స్ట్రాండ్జా టోర్నమెంట్లోనూ పసిడి గెలిచాడు.
ఇది చదవండి:'హీనా, అంకుర్కు ఖేల్రత్న ఇవ్వండి'