ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అమెరికన్ స్ప్రింటర్ డేజా స్టీవెన్స్.. 18 నెలల నిషేధానికి గురైంది. గతేడాది మూడుసార్లు డోపింగ్ పరీక్షలకు హాజరు కాకపోవడం వల్లే అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే ఏడాది జరగబోయే ఒలింపిక్స్‌కు దూరం కానుంది. ఈమెపై నిషేధం ఈ సంవత్సరం ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమై, వచ్చే ఏడాది జరగబోయే ఒలింపిక్స్ చివరి రోజుల్లో ముగుస్తుంది.
డోపింగ్ పరీక్షలు మిస్.. ఒలింపిక్స్‌కు దూరం - olympics 2021American sprinter Stevens
గతేడాది మూడుసార్లూ డోపింగ్ పరీక్షలకు హాజరు కాకపోవడం వల్ల 18నెలల నిషేధానికు గురైంది స్ప్రింటర్ స్టీవెన్స్. దీంతో వచ్చే సంవత్సరం జరగబోయే ఒలింపిక్స్‌కు దూరమైంది.
అమెరికన్ స్ప్రింటర్ స్టీవెన్స్
స్టీవెన్స్ డోపింగ్ శాంపిల్స్ కోసం అధికారులు గతేడాది రెండుసార్లు ఫోన్లో సంప్రదించగా, ఆ సమయంలో ఈమె అందుబాటులో లేకుండా పోయింది. అయితే బ్యాటరీ అయిపోవడం, ఆకతాయి వేధింపుల వల్ల నంబర్ మార్చిన సమయాల్లోనే ఇలా జరిగినట్లు తెలుస్తోంది.
200 మీటర్ల రన్నర్ అయిన స్టీవెన్స్.. 2016 రియో ఒలింపిక్స్ ఫైనల్లో ఏడో స్థానంలో, 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఐదో స్థానం సంపాదించింది.