తెలంగాణ

telangana

ETV Bharat / sports

All England Open: అదరగొట్టిన పుల్లెల గోపీచంద్​ తనయ.. సెమీస్​లో లక్ష్యసేన్ - గాయత్రి పుల్లెల సెమీస్​లోకి

All England Open: ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్​షిప్​లో గాయత్రి గోపీచంద్​ జోడీ సెమీస్​లోకి దూసుకెళ్లింది. క్వార్టర్స్​లో లీసోహీ& షిన్ సియంగ్​చాన్ ద్వయంపై విజయం సాధించింది.

All England Championships
ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్​షిప్​

By

Published : Mar 18, 2022, 7:49 PM IST

Updated : Mar 18, 2022, 8:50 PM IST

All England Open: ఆల్​ ఇంగ్లాండ్​ ఓపెన్​లో వుమెన్స్ డబుల్స్​లో భారత యువ జంట సత్తా చాటింది. క్వార్టర్​ ఫైనల్లో పీ గాయత్రి గోపిచంద్​, త్రీసా జాలీ జోడీ.. దక్షిణ కొరియాకు చెందిన లీసోహీ& షిన్ సియంగ్​చాన్ జోడీపై అద్భుత విజయం సాధించింది. వుమెన్స్ డబుల్స్ క్వార్టర్​ఫైనల్లో ఈ జంట 14-21, 22-20, 21-15 తేడాతో గెలుపొంది సెమీస్​లోకి అడుగుపెట్టింది.

ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ దూసుకుపోతున్నాడు. రెండో రౌండ్‌లో ప్రపంచ నంబర్ 3 ర్యాంకర్‌ను ఓడించి మరీ క్వార్టర్స్‌కు వచ్చిన లక్ష్యసేన్‌కు అదృష్టం కలిసొచ్చింది. క్వార్టర్స్‌లో చైనా ఆటగాడు లు జువాంగ్ జు తప్పుకోవడం (వాకోవర్‌) లక్ష్యసేన్‌ సెమీస్‌కు చేరుకున్నాడు. ఇప్పటికే సింగిల్స్‌ విభాగంలో కిదాంబి రెండో రౌండ్‌లో వెనుదిరగగా.. మహిళల విభాగంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఓటమిపాలయ్యారు.

భారత్‌కు చెందిన డబుల్స్‌ ఐదో సీడెడ్ సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకిరెడ్డి -చిరాగ్‌ శెట్టి క్వార్టర్స్‌ దాటలేకపోయారు. ఇండోనేషియా టాప్‌ సీడ్ మార్కస్‌ ఫెర్నాల్డ్‌ గిడోయిన్‌, కెవిన్‌ సంజయా సుకుమౌల్జో చేతిలో 22-24, 17-21 తేడాతో సాయిరాజ్‌-చిరాగ్ జోడీ ఓడిపోయింది.

ఇదీ చూడండి:కొత్త జట్టుకు పెద్ద దెబ్బ.. ఐపీఎల్ నుంచి ఆ బౌలర్ ఔట్

Last Updated : Mar 18, 2022, 8:50 PM IST

ABOUT THE AUTHOR

...view details