ఆసక్తికరంగా సాగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో మరో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. అభిమానులకు మరింత కిక్కు అందించేందుకు రెండు సెమీస్, మూడో స్థానం పోరు, ఫైనల్ మ్యాచ్‌లు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడీ ఈ మ్యాచ్‌లకు మరో ప్రత్యేక ఆకర్షణ జత కానుంది. వీటి కోసం కొత్త బంతిని అడిడాస్ సిద్ధం చేసింది.
ఫిఫా వరల్డ్ కప్‌కు మరో ప్రత్యేక ఆకర్షణ.. కొత్త బంతి చూశారా? - Al hilm meaning
ఆసక్తికరంగా సాగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ జత కానుంది. జరగబోయే మ్యాచ్‌ల కోసం ఓ కొత్త బంతి సిద్ధం కానుంది. ఆ వివరాలు..
ఫిఫా వరల్డ్ కప్‌కు మరో ప్రత్యేక ఆకర్షణ.. కొత్త బంతి చూశారా?
గ్రూప్, ప్రిక్వార్టర్స్, క్వార్టర్స్‌లో వాడిన బంతి 'అల్ రెహ్లా' స్థానంలో ఇప్పుడు 'అల్ హిల్మ్' వచ్చింది. అరబిక్‌లో అల్ రెహ్లా అంటే ప్రయాణం అని, అల్ హిల్మ్ అంటే కల అని అర్థం. ఈ కొత్త బంతిలోనూ సెన్సార్ సాయంతో కనెక్టెడ్ సాంకేతికత ఉపయోగిస్తున్నారు. దీంతో బంతి ఆటగాడికి తాకిందో లేదో అని కచ్చితమైన సమాచారం తెలుసుకోవచ్చు. ఆఫ్‌సైడ్, గోల్స్ విషయంలో ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతోంది.
ఇదీ చూడండి:రంజీకి వేళాయె.. ఆ ప్లేయర్స్ రాణిస్తారా?
Last Updated : Dec 13, 2022, 12:36 PM IST