తమిళనాడుకు చెందిన జీ.ఆకాశ్.. భారతదేశ 66వ చెస్ గ్రాండ్ మాస్టర్‌గా అవతరించాడు. ఇటీవలే జరిగిన చెస్ ఫెడరేషన్ రెండో కౌన్సిల్ సమావేశంలో ఇతడికి ఈ హోదా ఇస్తున్నట్లు ఖరారు చేశారు. ఆకాశ్ తోటి ప్లేయర్లు అయిన ఎమ్. ప్రణీశ్, అమేయా అడిలు అంతర్జాతీయ మాస్టర్ టైటిల్స్ సాధించారు.
గ్రాండ్ మాస్టర్ హోదా(ఫిడే రేటింగ్ 2495) వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పిన ఆకాశ్... 2600 ఫిడే రేటింగ్ సాధించడమే తన ప్రస్తుత లక్ష్యమని వెల్లడించాడు.