ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్(Asian Boxing Championship) ఫైనల్లో తనకు అన్యాయం జరిగిందని భారత స్టార్ బాక్సర్ అమిత్ పంఘాల్(Amit Panghal) ఆరోపించిన నేపథ్యంలో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం(ఐబా)(International Boxing Association) విచారణకు ఆదేశించింది. 52 కిలోల విభాగం పైనల్‌తో ముడిపడిన అధికారులు.. టోర్నీలో పర్యవేక్షించిన మ్యాచ్‌లన్నింటినీ పరిశీలించి నివేదిక సమర్పించాలని రిఫరీయింగ్, జడ్జింగ్ కమిటీని ఐబా ఆదేశించింది. ఆ నివేదిక ఆధారంగా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.
అమిత్ ఆరోపణలపై విచారణకు ఐబా ఆదేశం - ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్
భారత బాక్సర్ అమిత్ పంఘాల్ ఆరోపణలపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం స్పందించింది. విచారణకు ఆదేశించింది. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తనకు అన్యాయం జరిగిందంటూ అమిత్ ఇటీవల ఆరోపణలు చేశాడు.
ఫైనల్లో అమిత్ 2-3తో జొయ్ వ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడిపోయాడు. అమిత్ గెలవాల్సిందని భావించిన భారత బృందం వెంటనే జడ్జీల తీర్పును సవాల్ చేసింది. జ్యూరీ అందుకు అంగీకరించలేదు. "ఆసియా ఛాంపియన్షిప్ ఫైనల్లో నేను గెలవాల్సింది. కానీ జడ్జీలు నా ప్రత్యర్థి వైపు నిలిచారు. ఎలాగైనా అతడు గెలవాలని ముందే నిర్ణయమైనట్లు అనిపించింది. నా నుంచి విజయాన్ని లాగేసుకున్నారు" అని అమిత్ భారత్ తిరిగొచ్చాక ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఐబా విచారణకు ఆదేశించింది.
ఇదీ చదవండి:ఆసియా ఛాంపియన్షిప్: అమిత్ పంగాల్‌కు రజతం