Aditi swami archery : భారత యువ ఆర్చర్ అదితి స్వామి తన సత్తా ఏంటో చూపించింది. 17 ఏళ్లకే సీనియర్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. మొదటిసారి సీనియర్ ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ బరిలోకి దిగిన ఈ పాప.. ఈ ఘనతను దక్కించుకుంది. బెర్లిన్ వేదికగా శనివారం జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఫైనల్లో .. మెక్సికోకు చెందిన ఆండ్రియా బెకెర్రాపై ఆమె గెలిచింది. ఫలితంగా గోల్డ్ మెడల్‌ను ముద్దాడింది.
World archery championships 2023 : అంతకుముందు సెమీఫైనల్‌లో అదితి మంచి ప్రదర్శన చేసింది. ఈ పోరులో తన మెంటార్, భారత సీనియర్ ఆర్చర్ వెన్నెం జ్యోతి సురేఖను ఓడించింది. తద్వారా ఈమె ఫైనల్‌కు అర్హత సాధించింది. సెమీస్‌లో ఓడిపోయిన జ్యోతి సురేఖ.. మూడో స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్‌లో విజయం సాధించింది సిల్వర్ మెడల్‌ను అందుకుంది.
మహారాష్ట్రలోని సతారాకు చెందిన అమ్మాయి అదితి. ఈ ఏడాది మొత్తంగా ఈమె సూపర్ ఫామ్‌లో జోరు కొనసాసించింది. నెల రోజుల క్రితం మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌లో అండర్-18 ప్రపంచ రికార్డును బ్రేక్ చేసింది.