2003లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత లాంగ్ జంప్ క్రీడాకారిణి అంజు బాబీ జార్జ్ కాంస్య పతకం సాధించింది. అయితే ఒక్క కిడ్నీతోనే ఈ ఘనత సాధించినట్లు సోమవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ విషయమై స్పందించిన కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు.. దేశాన్ని గర్వించేలా ప్రదర్శన చేశావని ట్వీట్ చేశారు. అంజు.. తన భర్త రాబర్ట్ బాబీ జార్జ్ నేతృత్వంలో మరింతగా రాణించింది.
"మీరు నమ్ముతారో లేదో తెలియదు. ఒకే కిడ్నీతో ప్రపంచ అగ్రస్థాయికి చేరిన వ్యక్తుల్లో నేను ఒకరిని. పెయిన్ కిల్లర్లతో అలర్జీ, పాదాలలో కదలిక లేకపోవడం లాంటి అనేక సమస్యల మధ్య ఆ ఘనత (2003 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్) సాధించగలిగాను. అదంతా కోచ్ చేసిన మాయతో పాటు ఆయన ప్రతిభకు ఉదాహరణ"
- అంజు బాబీ జార్జ్, భారత క్రీడాకారిణి
తన సంకల్పం ద్వారానే అంజు ఆ ఘనత సాధించగలిగారని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.