ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు సత్తాచాటారు. మిక్స్డ్ పెయిర్ విభాగంలో జ్యోతి సురేఖ-అభిషేక్ వర్మ స్వర్ణం సాధించారు. ఈ టోర్నీలో మనకు ఇదే తొలి పసిడి కావడం విశేషం. మొత్తంగా ఈ టోర్నీలో ఏడు పతకాలు సాధించి సత్తాచాటారు.
చైనీస్ తైపీ జంట స్యూన్ చెన్- లు చెన్‌తో జరిగిన ఫైనల్లో 158-151 తేడాతో వర్మ-జ్యోతి విజయం సాధించారు. ఈ పతకంతో భారత్.. మొత్తంగా ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో టోర్నీని ముగించింది.
పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, మోహన్ భరద్వాజ్‌లతో కూడిన భారత బృందం.. ఫైనల్‌లో ఓటమిపాలైంది. కొరియాపై 232-233 తేడాతో ఓడి, కేవలం ఒక్క పాయింట్‌తో స్వర్ణాన్ని చేజార్చుకుంది.