మే నెల చివర్లో తిరిగి అథ్లెట్ల శిక్షణ ప్రారంభించే అవకాశం ఉండడం వల్ల సాయ్ ముందస్తు సన్నాహాల్లో పడింది. అయితే కేంద్ర ఆరోగ్య, హోం మంత్రిత్వ శాఖల నుంచి అనుమతి వచ్చాకే ఈ శిక్షణ కేంద్రాలు తెరుచుకుంటాయని సాయ్ స్పష్టం చేసింది. కేంద్రాల్లో పాటించాల్సిన పద్ధతులు, నియమాలపై ఆరుగురు సభ్యుల కమిటీ 33 పేజీల దస్త్రాన్ని సిద్ధం చేసింది. దానికి క్రీడ, ఆరోగ్య మంత్రిత్వ శాఖల ఆమోదం లభించాల్సి ఉంది. మాస్కులు వేసుకోవడం సహా అనేక షరతుల్ని ఇందులో పేర్కొన్నారు.
క్రీడాకారులకు 'ఆరోగ్యసేతు' యాప్ తప్పనిసరి!
లాక్డౌన్ ఆంక్షలను కేంద్రం త్వరలోనే సడలిస్తుందన్న ఆశాభావంతో త్వరలోనే అథ్లెట్ల శిక్షణ తిరిగి ప్రారంభించాలని భావిస్తోంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్). ఈ క్రమంలో క్రీడాకారులు తప్పకుండా పాటించాల్సిన కొన్ని నియమాలను సిద్ధం చేసింది. వాటిని క్రీడా, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదించాల్సి ఉంది.
వెలుతురు తక్కువగా ఉన్న దుస్తులు మార్చుకునే గదులను తొలగించడం.. అథ్లెట్లు వాడిన తర్వాత ప్రతిసారి శిక్షణ సామగ్రిపై క్రిమిసంహారక రసాయనాలు పిచికారీ చేయడం.. అథ్లెట్లందరితో పాటు సిబ్బంది కూడా తమ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ను తప్పనిసరిగా కలిగి ఉండడం.. జిమ్‌లో విడతల వారీగా కసరత్తులు చేసేలా చూడడం.. ఇవీ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అథ్లెట్ల కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ప్రతిపాదించిన కొన్ని ప్రధాన అంశాలు.
ఇదీ చూడండి.. గరిటె పట్టిన సింధు.. బిర్యానీ పసందు!