తెలంగాణ

telangana

ETV Bharat / sports

యూత్​ బాక్సింగ్: సెమీస్‌లో మరో ఏడుగురు భారతీయులు - world youth championship boxing

ప్రపంచ యూత్ బాక్సింగ్​ ఛాంపియన్​షిప్స్​లో భారత బాక్సర్లు సత్తా చాటుతున్నారు. మరో ఏడుగురు బాక్సర్లు సెమీస్​లోకి ప్రవేశించారు. దీంతో వీరంతా ఏదో ఒక పతకం ఖాయం చేసుకున్నారు.

youth world championship, 7 more Indians boxers in semifinals
ప్రపంచ యూత్​ బాక్సింగ్​ ఛాంపియన్​షిప్స్​, బేబీరోజిసినా చాను, అరుంధతి చౌదరి

By

Published : Apr 21, 2021, 8:19 AM IST

ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో మరో ఏడుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. బేబీరోజిసినా చాను (51 కేజీ), అరుంధతి చౌదరి (69కేజీ), సనమాచ చాను (75కేజీ), అంకిత్‌ నర్వాల్‌ (64కేజీ), విశాల్‌ గుప్తా (91కేజీ), విశ్వామిత్ర చొంగ్తామ్‌ (49 కేజీ), సచిన్‌ (56కేజీ) క్వార్టర్స్‌లో నెగ్గి పతకాలు ఖాయం చేసుకున్నారు. మహిళల క్వార్టర్స్‌లో బీబీరోజిసినా చాను 5-0తో కుబికా (పోలెండ్‌)పై, అరుంధతి 5-0తో అనా సెజ్కో (ఉక్రెయిన్‌)పై నెగ్గారు.

ఇదీ చదవండి:రైజర్స్xకింగ్స్: గెలుపు ఆకలి తీరేదెవరికో!

సనమాచ చాను.. రష్యా అమ్మాయి జువానును ఓడించింది. పురుషుల క్వార్టర్స్‌లో విశ్వామిత్ర, అంకిత్‌ నర్వాల్‌లు 5-0తో తమ తమ ప్రత్యర్థులు ఒమర్‌ అమెతోవిచ్‌ (సెర్బియా), జెకీల్‌ ద క్రజ్‌ (బ్రెజిల్‌)పై విజయం సాధించారు. ఇంతకుముందే నలుగురు భారత బాక్సర్లు సెమీస్‌లో అడుగుపెట్టారు.

ఇదీ చదవండి:'దక్షిణాఫ్రికా బోర్డు సంక్షోభంలో జోక్యం చేసుకోం'

ABOUT THE AUTHOR

...view details