జపాన్‌లోని ఎక్కువశాతం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ షెడ్యూల్ ప్రకారమే టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాక్ మరోసారి స్పష్టం చేశాడు. ఇప్పటికే ఏడాది పాటు వాయిదా పడ్డ క్రీడలను ఈ సారి నిర్వహించి.. కరోనా కష్ట కాలానికి ముగింపు ఉంటుందనే ఆశను బలంగా చాటుతామని చెప్పాడు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) 47వ కాంగ్రెస్ సమావేశంలో శనివారం వర్చువల్‌గా అతను మాట్లాడాడు.
షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్: ఐఓసీ అధ్యక్షుడు - ఒలింపిక్స్ థామస్ బాక్
కరోనా కాలానికి ముగింపు ఉంటుందనే ఆశను బలంగా చాటేందుకు ఒలింపిక్స్‌ను నిర్వహించి తీరుతామని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ స్పష్టం చేశారు. మెగాక్రీడల్లో పాల్గొనే అథ్లెట్లు 70 శాతం మంది టీకా వేసుకున్నారని తెలిపాడు.
"టోక్యో ఒలింపిక్స్ సమీపిస్తుండడం వల్ల ఆఖరి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ కఠిన సమయంలోనూ మనం తిరిగి పుంజుకోగలమని.. మన ఐక్యత, వైవిధ్యాన్ని బలమైన సందేశంగా చాటిచెప్పాల్సిన అవసరం ఉంది. ఈ కష్ట కాలానికి ముగింపు ఉంటుందనే ఆశను టోక్యో చూపెట్టనుంది. ప్రతి ఒక్కరి రక్షణ, భద్రతకే అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాం. జపాన్ నిర్వాహకులతో కలిసి మన అథ్లెట్లు సురక్షితమైన వాతావరణంలో పోటీపడేలా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇప్పటికే ఒలింపిక్స్‌లో పాల్గొనే 70 శాతం మంది అథ్లెట్లు టీకా తీసుకున్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగనుంది. అథ్లెట్లకు టీకా వేసేందుకు మూడు తయారీ సంస్థలు ముందుకొచ్చాయి. ఈ క్రీడలు సాధ్యం కావాలంటే మేం కొన్ని త్యాగాలు చేయక తప్పదు. ఒలింపిక్స్‌లో పోటీ పడాలనే అథ్లెట్ల కల కచ్చితంగా నిజమవుతుంది" అని బాక్ పేర్కొన్నాడు.
ఇవీ చదవండి: