భాగ్యనగరంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు 4వ జాతీయ మాస్టర్స్ గేమ్స్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. క్రీడలకు సంబంధించి గోడ ప్రతులను మాస్టర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, మాస్టర్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
4వ జాతీయ మాస్టర్స్ గేమ్స్ గోడప్రతుల ఆవిష్కరణ - 4th master's games Poster release
4వ జాతీయ మాస్టర్స్ గేమ్స్‌కు హైద్రాబాద్ వేదిక కానుంది. ఇందుకు సంబంధించిన ప్రతులను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి తన కార్యాలయంలో ఆవిష్కరించారు.
![4వ జాతీయ మాస్టర్స్ గేమ్స్ గోడప్రతుల ఆవిష్కరణ National master's Games](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6362869-317-6362869-1583854577464.jpg)
National master's Games
4వ జాతీయ మాస్టర్స్ గేమ్స్ గోడప్రతుల ఆవిష్కరణ
తెలంగాణలో తొలిసారి జాతీయ మాస్టర్ గేమ్స్‌ను నిర్వహిస్తున్నామని ఛైర్మన్ తెలిపారు. నగరంలోని గచ్చిబౌలి, కోట్ల విజయభాస్కర్, ఎల్బీ స్టేడియాల్లో ఆటలు జరుగుతాయని తెలిపారు. 31 రాష్ట్రాలకు చెందిన 8 వేల మంది క్రీడాకారులు పాల్గొంటారని వివరించారు. ఈ క్రీడలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని శాయ్ ఛైర్మన్ స్పష్టం చేశారు.