తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫుట్​బాల్​ మ్యాచ్​లో ఫ్యాన్స్ మధ్య ఘర్షణ.. 22 మందికి గాయాలు - సాకర్​ గేమ్​లో అభిమానుల గొడవ

ఏ ఆటకైనా అభిమానులుంటేనే సందడి. అయితే ఆ అభిమానుల మధ్య ఎలాంటి చిన్న ఘర్షణ జరిగినా విధ్వంసమే. అలాంటి ఘటనే ఉత్తర అమెరికాలో జరిగింది. సెంట్రల్​ మెక్సికోలో జరిగిన సాకర్​ మ్యాచ్​లో అభిమానులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 22 మంది గాయపడ్డారు.

north america
soccer incident

By

Published : Mar 6, 2022, 3:10 PM IST

ఉత్తర అమెరికాలోని సెంట్రల్ మెక్సికోలో అవాంఛనీయ ఘటన జరిగింది. సాకర్​ మ్యాచ్​ను చూడడానికి వచ్చిన కొంతమంది అభిమానులు ఘర్షణకు దిగారు. ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ ఘటనలో 22 మంది గాయపడ్డారు.

అసలు ఏం జరిగిందంటే?

శనివారం సెంట్రల్ మెక్సికో లీగ్​ ఛాంపియన్​ అయిన గ్వాడలజారా, అట్లాస్​ మధ్య మ్యాచ్​ జరిగింది. ఆటలో 62వ నిమిషం దగ్గర అభిమానుల మధ్య ఘర్షణ మొదలైంది. ఘర్షణ మొదలవ్వగానే మ్యాచ్​ తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. మిగతా అభిమానులు, మహిళలు, పిల్లలు గేట్ల ద్వారా పరిగెత్తి బయటకు వెళ్లిపోయారు. కుర్చీలతో దాడి చేసుకున్నారు. మరికొంతమంది బెంచీలను ధ్వంసం చేశారు. దాడిలో గాయపడిన అభిమానులను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో అందరూ మగ వాళ్లేనని, ప్రస్తుతం గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని పోలీసులు తెలిపారు.

అట్లాస్ జట్టు ఇలాంటి ఘటనను గతేడాది కూడా ఎదుర్కొంది. క్వెరెటారో గవర్నర్ మారిసియో కురి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

ఇదీ జరిగింది: బౌన్సర్లను నిషేధించాల్సిన అవసరం లేదు: ఎంసీసీ

ABOUT THE AUTHOR

...view details