భారత మహిళల బాక్సింగ్ శిక్షణ శిబిరంలో కరోనా బాధితుల సంఖ్య 21కి చేరింది. ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ శిబిరంలో హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్ రాఫెల్ బెర్గామాస్కో చీఫ్ కోచ్ మహ్మద్ అలీ ఖమర్ సహా మొత్తం 21 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. ఇందులో ఒలింపిక్స్‌కు వెళ్లే బాక్సర్లు ఎవరూ లేరని సాయ్ తెలిపింది.
"ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జాతీయ మహిళల బాక్సింగ్ శిబిరంలో కరోనా పరీక్షలు నిర్వహించాం. క్రీడాకారులు, సహాయ సిబ్బంది సహా 21 మంది పాజిటివ్‌గా తేలారు. వీరిలో ఒలింపిక్ బాక్సర్లు లేరు. కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన ఒలింపిక్ బాక్సర్లు, ఇతర క్రీడాకారిణుల్ని దిల్లీలోని జవహర్లాల్ ఇండోర్ స్టేడియంలో సురక్షితమైన ప్రదేశానికి తరలించాం"