కరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో వచ్చే ఏడాది జరగాల్సిన కామన్వెల్త్ ఆర్చరీ, షూటింగ్ క్రీడలను రద్దు చేస్తున్నట్లు కామన్వెల్త్ గేమ్స్ ఇండియా (CIG) ఎగ్జిక్యూటివ్ బోర్డు ప్రకటించింది. 2022 జులైలో బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. అంతకు 6 నెలల ముందే చండీగఢ్‌లో షూటింగ్, ఆర్చరీ క్రీడలు నిర్వహించాలని గతంలో నిర్ణయించారు.
Corona Effect: భారత్‌లో జరగాల్సిన కామన్వెల్త్ గేమ్స్ రద్దు - స్పోర్ట్స్ న్యూస్
కొవిడ్ దెబ్బకు మరో అంతర్జాతీయ టోర్నీ రద్దయింది. ఈ విషయాన్ని కామన్వెల్త్ గేమ్స్ ఇండియా ప్రకటించింది. ఈ విషయం తమను ఎంతో బాధిస్తోందని తెలిపింది.
కామన్వెల్త్ గేమ్స్
అయితే చండీగఢ్‌లో జరగాల్సిన కామన్వెల్త్ ఆర్చరీ, షూటింగ్ పోటీలను.. కామన్‌వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (CGF) సూచనతో రద్దు చేస్తున్నట్లు కామన్వెల్త్ గేమ్స్ ఇండియా వెల్లడించింది. పోటీల రద్దు నిర్ణయం తమను తీవ్రంగా బాధిస్తోందని సీజీఎఫ్ అధ్యక్షుడు డేమ్ లూయిస్ మార్టిన్ తెలిపారు.
ఇవీ చదవండి: