ఇండోనేసియాలోని జకర్తా వేదికగా 2018లో జరిగిన ఆసియా గేమ్స్‌లో.. 4×400 మిక్స్డ్ రిలే విభాగంలో రజతం సాధించింది భారత బృందం. ఆనాడు జట్టుగా మహమ్మద్ అనాస్, ఎమ్.ఆర్ పూవమ్మ, హిమదాస్, అరోకియా రాజీవ్ బరిలోకి దిగారు. అయితే పోటీలో బహ్రెయిన్ బృందం తొలిస్థానం కైవసం చేసుకొని పసిడి సొంతం చేసుకుంది. 3:15.71 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది హిమదాస్ బృందం.
గెలిచిన రెండేళ్లకు హిమదాస్ బృందానికి స్వర్ణం.. కారణమిదే.?
ఆసియా గేమ్స్-2018లో మిక్స్డ్ రిలేలో పాల్గొన్న భారత బృందం తాజాగా స్వర్ణం సొంతం చేసుకుంది. అద్భుతమైన ప్రదర్శన చేసినా చివరికి రెండో స్థానంలో రజతంతో సరిపెట్టుకున్న హిమదాస్ బృందానికి అదృష్టం కలిసి వచ్చింది. ఇందుకు కారణం తెలియాలంటే ఇది చదవాల్సిందే.
అయితే తాజాగా జరిగిన డోపింగ్ పరీక్షలో బహ్రెయిన్ జట్టులోని స్టార్ అథ్లెట్ కెమి అదెకోయా డోపిగా తేలడం వల్ల ఆమెపై నాలుగేళ్ల నిషేధం విధించారు. అంతేకాకుండా వాళ్లకు ఇచ్చిన బంగారు పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. దాన్ని తర్వాతి స్థానంలో ఉన్నహిమదాస్ జట్టుకు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు భారత అథ్లెటిక్స్ సమాఖ్య. నాలుగో స్థానంలో ఉన్న అను రాఘవన్ బృందం మూడో ర్యాంక్‌కు చేరి కాంస్యం ఖాయం చేసుకున్నారు.
దీనితో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఆ ఏడాది 20 పతకాలు గెలిచిన భారత ఆటగాళ్లు.. ఎనిమిది పసిడి, 9 రజత, 3 కాంస్య పతకాలు సాధించారు.