టోక్యో ఒలింపిక్స్‌కు అంతా ముస్తాబైంది. ప్రపంచ దేశాలకు చెందిన క్రీడాకారులు.. పతకమే లక్ష్యంగా సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా గతంలో ఒలింపిక్స్‌లో జరిగిన ఆసక్తికర అంశాలు, విషయాలు మీకోసం.
1976, మాంట్రియల్ ఒలింపిక్స్
- మహిళల బాస్కెట్‌బాల్, రోయింగ్, టీం హ్యాండ్‌బాల్.. ఈ ఒలింపిక్స్‌తోనే ప్రవేశపెట్టారు.
- కృత్రిమంగా తయారుచేసిన పిచ్‌పై తొలిసారి హాకీ మ్యాచ్‌లు జరిగాయి.
- 14 ఏళ్ల రొమేనియన్ జిమ్నాస్ట్ నదియా కొమనేకి.. అన్ఈవెన్ బార్స్ ఈవెంట్లో అద్భుత ప్రదర్శన చేసి 10కి 10 పాయింట్లు సాధించింది. మొత్తంగా గరిష్ఠమైన ఏడు మార్కుల్ని పొందింది.
- బ్రిటీష్ రాజకుటుంబానికి చెందిన యువరాణి అన్నే.. తమ దేశ ఈక్వెస్ట్రియన్ జట్టు తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొంది. ఈ ఫ్యామిలీ నుంచి మెగాక్రీడల్లో ఆడిన తొలి వ్యక్తి ఈమెనే కావడం విశేషం.
- ఆఫ్రికాకు చెందిన 26 దేశాల్ని ఈ ఒలింపిక్స్‌లో ఆడకుండా నిషేధించారు. న్యూజిలాండ్ కూడా పోటీల్లో పాల్గొనకుండా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చెప్పింది. 1964 నుంచి ఒలింపిక్ నిషేధమున్న దక్షిణాఫ్రికా జట్టుతో న్యూజిలాండ్ రగ్బీ మ్యాచ్ ఆడటమే ఇందుకు కారణం.
- మార్గరెట్ మర్డోక్(యూఎస్).. షూటింగ్లో పతకం గెలుచుకున్న తొలి మహిళగా నిలిచింది. ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లోనూ మెడల్ గెలుచుకున్న షూటర్‌గా ఘనత సాధించింది.
- ఈ ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్లు.. 32 ప్రపంచ రికార్డులు నెలకొల్పారు.
1980, మాస్కో ఒలింపిక్స్
- తూర్పు ఐరోపాలో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ ఇవే.
- అఫ్గానిస్థాన్‌పై సోవియట్ యూనియన్ దాడి చేసిన కారణంగా అమెరికాతో పాటు 60 దేశాలు, ఈ ఒలింపిక్స్‌ను బహిష్కరించాయి.
- 1956 తర్వాత అతి తక్కువ దేశాలు పాల్గొన్న ఒలింపిక్స్‌గా ఇది నిలిచింది. 8 దేశాలు మాత్రమే బరిలో నిలిచాయి.
- అంగోలా, బోట్స్వానా, సైప్రస్, లావోస్, మొజాంబిక్, సీచెల్స్ .. ఈ ఒలింపిక్స్‌తోనే అరంగేట్రం చేశాయి.
- ఈ ఒలింపిక్స్‌లో పాల్గొన్న పలు దేశాలు.. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేందుకు నిరాకరించాయి. పతకం ప్రదానం చేసిన పలు సందర్భాల్లో, వారి దేశ జాతీయ గీతానికి బదులు ఒలింపిక్ గీతాన్ని ప్లే చేశారు.
- రష్యాకు చెందిన అలెగ్జాండర్ దిత్యాతిన్.. పురుషుల జిమ్నాస్టిక్స్ ప్రతి ఈవెంట్లోనూ పతకం గెల్చుకున్నాడు. మొత్తంగా ఓ ఒలింపిక్స్‌లో ఎనిమిది మెడల్స్ సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు.
- తూర్పు జర్మనీ మహిళలు.. స్విమ్మింగ్‌లో దూకుడు చూపించారు. 1976 ఒలింపిక్స్‌లానే ఇందులో 13కి 11 మెడల్స్ సాధించడం విశేషం.
1984, లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్
- మహిళల తొలి మారథాన్.. ఈ ఒలింపిక్స్‌లో పెట్టారు. జోన్ బెనాయిట్(యూఎస్ఏ) విజేతగా నిలిచింది.
- రిథమిక్ జిమ్నాస్టిక్స్, సింక్రనైజ్డ్ స్విమ్మింగ్, మహిళల సైక్లింగ్ రోడ్రేస్.. ఈ ఒలింపిక్స్‌తోనే ప్రవేశపెట్టారు.
- సోవియట్ యూనియన్, తూర్పు జర్మనీ, క్యూబా తదితర కమ్యూనిస్ట్ దేశాలు.. 1984 ఒలింపిక్స్‌ను బహిష్కరించాయి
- అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు.. తమ ఉత్పత్తులపై ఒలింపిక్ సింబల్‌ను ముద్రించి, వాటిని విక్రయించడం విశేషం.
- బలమైన ఐరోపా జట్లు పాల్గొనకపోవడం వల్ల జిమ్నాస్టిక్స్ ఈవెంట్లో అమెరికా పురుషుల, మహిళల జట్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాయి.
- క్యూబా బాక్సర్ల గైర్హాజరీతో యూఎస్ బాక్సర్లు ఆకట్టుకునే ప్రదర్శన చేసి, ఏకంగా తొమ్మిది బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు.
ఇవీ చదవండి: