తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఘనంగా సౌత్ ఆసియాన్ గేమ్స్ ప్రారంభ వేడుకలు - ఖాట్మండ్ వేదికగా దక్షిణాసియా పోటీలు

నేపాల్ రాజధాని కాఠ్మాండ్ వేదికగా 13వ దక్షిణాసియా పోటీలు జరగుతున్నాయి. ఆదివారం ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

13th South Asian Games
దక్షిణాసియా

By

Published : Dec 2, 2019, 10:47 AM IST

13వ సౌత్ ఆసియాన్ గేమ్స్ ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల​కు నేపాల్‌ రాజధాని కాఠ్మాండ్ ఆతిథ్యమిస్తోంది. మొత్తం పదిరోజుల పాటు ఈ క్రీడలు జరగనున్నాయి. ప్రారంభ వేడుకలను దశరథ్‌ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పోటీల్లో పాల్గొంటున్న జట్లు చేసిన మార్చ్‌ ఫాస్ట్‌ కనులవిందు చేసింది.

ఈ పోటీల్లో 75 మందితో కూడిన భారత బృందానికి షాట్‌పుట్ ఆటగాడు తేజిందర్‌పాల్‌ సింగ్‌, 1500 మీటర్ల రేసర్‌ చిత్ర నేతృత్వం వహించారు. భారత్​తో పాటు ఆతిథ్య నేపాల్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, మాల్దీవులు, పాకిస్థాన్‌, శ్రీలంక దేశాలు పాల్గొన్నాయి.

భారత బృందం

ఈ టోర్నీలో మొత్తం 28 అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. భారత్‌ 17 విభాగాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

ఇవీ చూడండి.. ప్రపంచకప్​లో పాల్గొనే టీమిండియా జట్టిదే..

ABOUT THE AUTHOR

...view details