తెలంగాణ

telangana

ETV Bharat / sports

CHESS NEWS: గ్రాండ్​మాస్టర్​గా అభిమన్యు.. అదిరిపోయే రికార్డు - chess latest news

భారత సంతతి చిన్నారి అభిమన్యు మిశ్రా.. అత్యంత తక్కువ వయసులో గ్రాండ్​మాస్టర్​ హోదా దక్కించుకున్నాడు. బుడాపెస్ట్​లో జరుగుతున్న పోటీల్లో గెలిచి, ఈ ఘనత సాధించాడు.

12-year-old Abhimanyu Mishra becomes youngest Grandmaster in chess history
అభిమాన్యు

By

Published : Jul 1, 2021, 9:34 AM IST

భారత సంతతి అమెరికన్​ చిన్నారి అభిమన్యు మిశ్రా అరుదైన ఘనత సాధించాడు. చిన్న వయసులోనే గ్రాండ్​మాస్టర్​గా నిలిచాడు. బుడాపెస్ట్​లో జరిగిన పోటీల్లో గెలిచి, 12 ఏళ్ల 4 నెలల 25 రోజుల్లో ఈ రికార్డును అందుకున్నాడు. ఈ క్రమంలోనే 2016లో సెర్గీ కర్జాకిన్ నెలకొల్పిన ఘనతను చెరిపేశాడు. సెర్గీ, 12 ఏళ్ల 7 నెలల వయసులో గ్రాండ్​మాస్టర్​గా అవతరించాడు.

గతేడాది ఇంటర్నేషనల్​ మాస్టర్​ హోదా దక్కించుకున్న అభిమన్యు.. తాను పాల్గొన్న ప్రతి పోటీలోనూ గెలుస్తూ, సత్తా చాటాడు. ఏప్రిల్​ నుంచి హంగేరీలో ఉన్న అభిమన్యు.. ఆ నెలలో తొలి నార్మ్స్, మేలో రెండో నార్మ్స్​ పొందాడు. మూడో నార్మ్స్ కోసం ఇప్పటివరకు ఎదురుచూడాల్సి వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details