100 మీటర్ల పరుగు ప్రపంచ ఛాంపియన్ కోల్‌మన్ (అమెరికా)పై అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) వేటు వేసింది. ఆచూకీ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు కోల్‌మన్‌పై రెండేళ్ల నిషేధం విధించింది. ఇప్పటికే మూడు సార్లు డోప్ పరీక్షలకు డుమ్మాకొట్టి త్రుటిలో నిషేధం నుంచి బయటపడిన కోల్‌మన్‌పై ఏఐయూ ఎట్టకేలకు కొరడా ఝుళిపించింది.
అథ్లెట్ 'కోల్‌మన్'పై రెండేళ్ల నిషేధం - 100 మీటర్ల ప్రపంచ పరుగు ఛాంపియన్
100 మీటర్ల పరుగు ప్రపంచ ఛాంపియన్ క్రిస్టియన్ కోల్‌మన్‌పై రెండేళ్ల నిషేధం విధించింది అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్. డోప్ పరీక్షలకు డుమ్మా కొట్టిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
అథ్లెట్ 'కోల్‌మన్'పై రెండేళ్ల నిషేధం
2019 డిసెంబరు 9న క్రిస్ట్‌మన్ షాపింగ్ తర్వాత ఇంట్లోనే ఉంటానని డోపింగ్ అధికారులకు చెప్పిన కోల్‌మన్.. వాళ్లు వచ్చినపుడు ఇంట్లో లేడు. "కోల్‌మన్‌పై రెండేళ్ల నిషేధం విధిస్తున్నాం. ఈ నిర్ణయంపై క్రీడల ఆర్బిట్రేషన్ కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు" అని ఏఐయూ తెలిపింది.
ఇదీ చదవండి:ఆ ఓవర్లలో ముంబయి బాగా ఆడింది: కోహ్లి