తెలంగాణ

telangana

ETV Bharat / sports

నెహ్రూ హాకీ కప్​: మైదానంలోనే ఆటగాళ్ల 'కొట్లాట' - hockey,fockey fight

దిల్లీలోని జాతీయ హాకీ స్టేడియంలో జరిగిన ఓ మ్యాచ్​ కొట్లాటకు దారితీసింది. నెహ్రూ కప్​లో భాగంగా సోమవారం  పంజాబ్​ పోలీస్​, పంజాబ్​ నేషన​ల్​ బ్యాంక్​ జట్లు ఫైనల్లో తలపడ్డాయి. ఇందులో ఇరు జట్ల ఆటగాళ్లు హకీ కర్రలతో దాడి చేసుకున్నారు.

Watch: Shocking on-field fight in Nehru Cup hockey final 2019
నెహ్రూ హాకీ కప్​: మైదానంలోనే ఆటగాళ్ల 'కొట్లాట'

By

Published : Nov 26, 2019, 7:56 AM IST

Updated : Nov 26, 2019, 8:04 AM IST

నెహ్రూ హాకీ కప్​: మైదానంలోనే ఆటగాళ్ల 'కొట్లాట'

ఫైనల్‌ మ్యాచ్‌ అంటే ఆటగాళ్లు హోరాహోరీగా తలపడడం మామూలే. కానీ దిల్లీలో జరిగిన ఓ హాకీ మ్యాచ్​లో ఆటగాళ్లు అంతకుమించి గొడవపడ్డారు. స్టిక్స్‌తో పరస్పరం దాడులు చేసుకొని... మైదానాన్ని రణరంగంగా మార్చారు. ఈ సంఘటన నెహ్రూ కప్‌ హాకీ టోర్నీలో భాగంగా పంజాబ్‌ పోలీస్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) జట్ల మధ్య జరిగింది. సోమవారం ఇరుజట్ల మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ఫైనల్​ మ్యాచ్‌ మూడో క్వార్టర్​లో స్కోరు 3-3తో ఉన్న సమయంలో ఈ రభస మొదలైంది. గొడవను ఆపిన నిర్వాహకులు... మ్యాచ్‌ను కొనసాగించగా పీఎన్‌బీ 6-3తో విజయం సాధించింది. నెహ్రూ కప్‌లో పాల్గొనకుండా టోర్నీ నిర్వాహకులు పోలీస్‌ జట్టుపై నాలుగేళ్లు, పీఎన్‌బీపై రెండేళ్ల నిషేధం విధించారు. అంతేకాకుండా రూ. 2 లక్షల ప్రైజ్​మనీలో... సగం కోత విధించి ఇచ్చారు.

Last Updated : Nov 26, 2019, 8:04 AM IST

ABOUT THE AUTHOR

...view details