తెలంగాణ

telangana

ETV Bharat / sports

'చాలా బాధగా ఉంది.. దయచేసి ఇలా చేయకండి' - వందనా కటారియా ట్రోల్​

ఒలింపిక్స్​ హాకీ సెమీస్​లో భారత మహిళల హాకీ జట్టు ఓటమికి కారణం.. అందులో ఓ వర్గానికి చెందిన ప్లేయర్లు ఉండటమే అంటూ కొంతమంది వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందిస్తూ కెప్టెన్​ రాణిరాంపాల్ భావోద్వేగానికి గురైంది. దయచేసి ఇలాంటివి చేయొద్దని, ప్లేయర్స్​కు అండగా ఉండాలని కోరింది.

rani
రాణి పాంపాల్​

By

Published : Aug 7, 2021, 1:47 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో ఓవైపు భారత మహిళల జట్టు ప్రదర్శన చూసి అందరు గర్వపడుతుంటే.. కొందరు మాత్రం విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అమ్మాయిలు పసిడి గెలవకపోవడానికి కారణం.. జట్టులో ఓ వర్గానికి చెందిన వారు(వందన కటారియాను ఉద్దేశించి) ఎక్కువగా ఉండటమేనని అంటున్నారు. వీరిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమైంది. తాజాగా.. ఈ వ్యవహారంపై మహిళల జట్టు సారథి రాణి రాంపాల్​ స్పందించింది. ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడొద్దని పిలుపునిచ్చింది.

"వందన కుటుంబానికి జరిగిన సంఘటన విని చాలా బాధపడ్డాను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఆమె తండ్రి ఇటీవల మరణించారు. తండ్రి అంత్యక్రియలకు వందన వెళ్లలేదు. ఒలింపిక్స్​కు ముందు వెళితే శిక్షణకు సమయం ఉండదని భావించి మాతోనే ఉండిపోయింది. మేమందరం దేశ నలుమూలల నుంచి వచ్చాం. మాలో హిందు, ముస్లిం, సిక్కులు ఇలా అనేక మతాలకు చెందిన వారు ఉంటారు. కానీ మాకు మతంతో సంబంధం లేదు. భారత్​, భారత్​ జెండాకు మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తాము. కాబట్టి ప్రజలు దయచేసి ఇలాంటి పనులు చేయొద్దని కోరుతున్నాను. ఆటగాళ్లు.. దేశ కీర్తి ప్రతిష్టల కోసం తమ జీవితాల్ని త్యాగం చేస్తారు. ప్లేయర్స్​ గెలిచినా, ఓడినా మీరు అండగా నిలవండి. అదే నా విన్నప్పం. అప్పుడే దేశం క్రీడాదేశంగా అవతరించగలదు."

-రాణి రాంపాల్​, మహిళల హాకీ జట్టు సారథి.

సెమీస్​ అనంతరం కాంస్య పోరులో గ్రేట్​ బ్రిటన్​పై 3-4తేడాతో భారత మహిళ హాకీ జట్టు తృటిలో ఓటమిపాలైంది. కానీ వారి అద్భుత పోరాటానికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసించారు.

ఇదీ చూడండి:'నవ భారతావనికి ఈ హాకీ వనితలు స్ఫూర్తి'

ABOUT THE AUTHOR

...view details