తెలంగాణ

telangana

ETV Bharat / sports

Olympics: అలాగైతే రెండు జట్లకూ స్వర్ణం

టోక్యో ఒలింపిక్స్​లో(Tokyo Olympics) కొత్త నిబంధనలు రాబోతున్నాయి. హాకీ ఫైనల్​లో ఏ జట్టయినా కరోనా కారణంగా తప్పుకుంటే.. తుది పోరుకు చేరిన రెండు జట్లకు స్వర్ణం ఇవ్వనున్నారు.

olympics
ఒలింపిక్స్​

By

Published : Jul 17, 2021, 6:41 AM IST

కరోనా నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌లో(Tokyo Olympics) కొత్త నిబంధనలను చూడబోతున్నాం. హాకీ ఫైనల్లో ఏ జట్టయినా కొవిడ్‌ కారణంగా వైదొలగాల్సి వస్తే.. తుది సమరానికి చేరిన రెండు జట్లకు స్వర్ణం దక్కనుంది.

ఫైనల్‌ చేరిన ఏదైనా జట్టు తప్పుకుంటే.. ఆ జట్టు చేతిలో సెమీస్‌లో ఓడిన బృందానికి తుది సమరంలో ఆడే అవకాశం ఇస్తామని ఇంతకుముందు తెలిపారు. ఆ నిబంధన మార్చి రెండు జట్లకు స్వర్ణం ఇవ్వాలని నిర్ణయించారు. కాంస్య పోరులో ఏ జట్టయినా కొవిడ్‌తో తప్పుకుంటే రెండు జట్లకూ కాంస్యం దక్కుతుంది. పూల్‌ మ్యాచ్‌ల్లో ఏ జట్టయినా వైదొలిగితే ప్రత్యర్థి జట్టు 5-0 గోల్స్‌తో గెలిచినట్లు ప్రకటిస్తారు.

ఇదీ చూడండి: Olympics: ఆ చిన్నారి కోసం ఒలింపిక్స్​కు జకోవిచ్

ABOUT THE AUTHOR

...view details