తెలంగాణ

telangana

ETV Bharat / sports

టోక్యో ఒలింపిక్స్​ హాకీ షెడ్యూల్​ విడుదల - భారత హాకీ జట్టు

40 దశాబ్దాల కల ఓ వైపు...1964 నాటి చరిత్రను మళ్లీ పునరావృతం చేయాలన్న ఆశ మరోవైపు. ఇందుకోసం భారత హాకీ జట్టు టోక్యో ప్రయాణించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా టోక్యో ఒలింపిక్స్​-2020 షెడ్యూల్​ను విడుదల చేసింది అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్​ఐహెచ్).

Tokyo Olympics 2020
40 ఏళ్ల కల: టోక్యో ఒలింపిక్స్​ హాకీ షెడ్యూల్​ విడుదల

By

Published : Dec 17, 2019, 5:57 PM IST

టోక్యో వేదికగా వచ్చే ఏడాది జులైలో ప్రారంభం కానున్న ఒలింపిక్స్​కు షెడ్యూల్​ను ప్రకటించింది అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్​ఐహెచ్​). ఇందులో భారత పురుషుల హాకీ జట్టు ప్రారంభ మ్యాచ్​లో న్యూజిలాండ్​తో, మహిళల జట్టు నెదర్లాండ్​తో తలపడనున్నాయి. జులై 25 నుంచి ఆగస్టు 7 వరకు మ్యాచ్​లు నిర్వహించనున్నారు.

బలమైన ప్రత్యర్థులతోనే​...

ప్రపంచ ర్యాంకింగ్స్​లో 5వ స్థానంలో ఉన్న భారత పురుషుల హాకీ జట్టు.. బలమైన ప్రత్యర్థిగా బరిలోకి దిగుతోంది. ఇప్పటివరకు ఎనిమిది సార్లు ఛాంపియన్​గా నిలిచిన టీమిండియా...​ ఆరంభ మ్యాచ్​లో న్యూజిలాండ్​తో అమీతుమీకి సిద్ధమవుతోంది. ఆ తర్వాత ప్రపంచ నెం.1 ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. స్పెయిన్​, ఢిఫెండింగ్​ ఛాంపియన్​ అర్జెంటీనా, ఆతిథ్య జపాన్​తోనూ పోటీ పడనుంది మెన్​ ఇన్​ బ్లూ.

గ్రూప్​-ఏ లో ఉన్న భారత జట్టు షెడ్యూల్​...

జులై 25- న్యూజిలాండ్​, జులై 26- ఆస్ట్రేలియా, జులై 28- స్పెయిన్​, జులై 30- అర్జెంటీనా, జులై 31- జపాన్​తో తలపడనుంది. ఆగస్టు 6న ఫైనల్​ మ్యాచ్​ జరగనుంది.

పురుషుల హాకీ జట్టు షెడ్యూల్​Tokyo Olympics 2020

మహిళలు...
ప్రపంచ ర్యాంకింగ్స్​లో 9వ స్థానంలో ఉన్న మహిళల జట్టు గ్రూప్​-ఏలో నిలిచింది. వీరు జులై 25- న్యూజిలాండ్​, జులై 27- జర్మనీ, జులై 29-గ్రేట్​ బ్రిటన్​, జులై 31-ఐర్లాండ్​, ఆగస్టు 1- దక్షిణాఫ్రికాతో పోటీ పడనున్నారు. ఆగస్టు 7న ఫైనల్​ మ్యాచ్​ జరుగుతుంది.

మహిళల హాకీ జట్టు షెడ్యూల్​Tokyo Olympics 2020

40 ఏళ్ల కల నెరవేరేనా...

గతంలో భారత పురుషుల జట్టు... 1928 (ఆమ్​స్టర్​డామ్​), 1932 (లాస్​ ఏంజిలిస్​), 1936 (బెర్లిన్​), 1948(లండన్​), 1952(హెల్సింకి),1956(మెల్​బోర్న్​), 1964(టోక్యో), 1980(మాస్కో) స్వర్ణం కైవసం చేసుకుంది. 1980 తర్వాత ఒక్కసారి హాకీలో పతకం తేలేకపోయింది భారత పురుషుల హాకీ జట్టు. 1980 నుంచి పదిసార్లు ఒలింపిక్స్​లో పాల్గొన్న మహిళల టీమ్.. ఈసారైనా పతకం తేవాలని ఆశతో చూస్తోంది.

ABOUT THE AUTHOR

...view details