టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics)లో పాల్గొననున్న పురుషుల, మహిళల జట్లను ప్రకటించింది హాకీ ఇండియా(Hockey India). పురుషుల జట్టులో పది మంది ఆటగాళ్లు తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడనుండగా.. మహిళల టీమ్‌లో ఈ సంఖ్య ఎనిమిదిగా ఉంది. రెండు జట్లలోనూ మొత్తం 16 మందితో కూడిన స్క్వాడ్లను వెల్లడించింది.
అమిత్, హర్దిక్, వివేక్, నీలకంఠ శర్మ, సుమిత్, షంషేర్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, గుర్జంత్ సింగ్, లలిత్ కుమార్.. తొలిసారి ప్రతిష్ఠాత్మక ఈవెంట్లో బరిలోకి దిగబోతున్నారు. గాయం కారణంగా 2016 రియో డి జనీరియో ఒలింపిక్స్‌కు దూరమైన డిఫెండర్ బిరేంద్ర లక్రా.. తాజా ఈవెంట్ కోసం తిరిగి జట్టుతో కలిశాడు.
ఇక 1980, 2016 ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన మహిళల హాకీ జట్టు మొత్తంగా మూడో సారి.. వరుసగా రెండో సారి మెగా ఈవెంట్లో పాల్గొననుంది. ప్రస్తుత టోక్యో ఒలింపిక్స్ జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు నిర్వహించనున్నారు.
పురుషుల జట్టు:
గోల్ కీపర్..
పీఆర్ శ్రీజేష్(కెప్టెన్).
డిఫెండర్లు..
హర్మన్‌ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, సురేందర్ కుమార్, అమిత్ రోహిదాస్, బిరేంద్ర లక్రా.
మిడ్ ఫీల్డర్లు..
హర్దిక్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ, సుమిత్.
ఫార్వర్డ్స్..