జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో(Junior Hockey World Cup) డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ బలంగా పుంజుకుంది. తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్ చేతిలో అనూహ్యంగా ఓడిన ఆతిథ్య జట్టు తన రెండో మ్యాచ్ (పూల్ బి)లో గోల్స్ మోత మోగించింది. గురువారం ఏకపక్షంగా సాగిన పోరులో 13-1తో కెనడాను(India vs Canada Hockey) చిత్తుగా ఓడించింది. మ్యాచ్‌లో భారత జట్టు ఆద్యంతం తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
సంజయ్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హ్యాట్రిక్ (17వ, 32వ, 59వ) సాధించాడు. అరిజీత్ సింగ్ హుందాల్ (40వ, 50వ, 51వ) కూడా మూడు గోల్స్ కొట్టాడు. ఉత్తమ సింగ్ (3వ, 47వ), శర్దానంద్ (35వ, 53వ) చెరో రెండు గోల్స్ చేయగా.. వివేక్ సాగర్ (8వ), మణిందర్ సింగ్ (27వ), అభిషేక్ లక్రా (55వ) తలో గోల్ కొట్టారు. కెనడా తరఫున నమోదైన ఏకైక గోల్‌ను క్రిస్టొఫర్ (30వ) సాధించాడు.